ఆశ్చర్యపోతున్న నిపుణులు : జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ…మరణాలు తక్కువ

  • Published By: venkaiahnaidu ,Published On : March 23, 2020 / 02:17 PM IST
ఆశ్చర్యపోతున్న నిపుణులు : జర్మనీలో కరోనా కేసులు ఎక్కువ…మరణాలు తక్కువ

యూరప్ లో అంతటా కరోనా వైరస్(COVID-19) వ్యాపించిన సమయంలో… జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది, కొరోనా వైరస్ ల ఎదురయ్యే ముప్పు గురించి దేశ గణాంకాలు మరింత ఖచ్చితమైన అంచనాను ఇస్తాయని కొందరు వాదిస్తుండగా, మరికొందరు దాని డేటా సేకరణ వెనుక ఉన్న మెథడాలజీ(పద్దతి)ని ప్రశ్నిస్తున్నారు. జర్మనీలో కూడా కరోనా కేసులు తక్కువేం కాదు. ఇప్పటివరకు 22వేల 400మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అవగా,కేవలం 84మంది మాత్రమే చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అంటే జర్మనీ… ప్రస్తుతం తీవ్రంగా కరోనా బారిన పడిన 10 దేశాలలో అత్యల్ప మరణాల రేటును కలిగి ఉంది. ఇటలీలో 9%,బ్రిటన్ లో 4.6% తో పోలిస్తే జర్మనీలో మరణాల రేటు 0.3%గా ఉంది.

జర్మనీ,ఇటలీ మధ్య వ్యత్యాసం

అయితే ఇటలీతో వ్యత్యాసం ముఖ్యంగా ఆశ్చర్యకరమైనది. ఎందుకంటే యూరప్ మొత్తంలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభా శాతం..ఇటలీ,జర్మనీలోనే అధికంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్…ఇటాలియన్లు జర్మన్ల కంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపాలని సూచిస్తుంది. పరిస్థితి చాలా వేగంగా తీవ్రతరమవుతున్న సమయంలో జర్మనీ రాజకీయ నాయకులు మరియు సీనియర్ ఆరోగ్య అధికారులు తక్కువ మరణాల రేటు( లో మోర్టాలిటీ రేట్) పై వ్యాఖ్యానించడానికి ఇష్టపడట్లేదు. జర్మనీ ప్రభుత్వ… కేంద్ర ప్రజారోగ్య సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్ స్టిట్యూట్(RKI)ప్రెసిడెంట్ లోథర్ వైలర్ మాట్లాడుతూ… ఇటలీ మరియు జర్మనీల మధ్య మరణాల రేటులో దీర్ఘకాలంలో గణనీయమైన వ్యత్యాసం ఉంటుందని తాను ఊహించానన్నారు.

ఇతర దేశాల కంటే జర్మనీ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వైద్యపరంగా సిద్ధంగా ఉందని చెప్పడం చాలా తొందరపాటు అవుతుందని జర్మనీలోని హాంబర్గ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ లో ఇన్ఫెక్టియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ మేరీలిన్ అడో అన్నారు. ఇటలీ,జర్మనీ మధ్య గణాంకాలలో వ్యత్యాసానికి ఒక వివరణగా… ఉత్తర ఇటలీలోని హాస్పిటల్స్ కొత్త కరోనా రోగులతో మునిగిపోతున్నప్పుడు, జర్మనీ ఇంకా పూర్తి సామర్థ్యంతో లేదు. బెడ్స్ క్లియర్ చేయడానికి, పరికరాలపై నిల్వ చేయడానికి మరియు సిబ్బందిని పున:పంపిణీ చేయడానికి ఎక్కువ సమయం ఉండిందని అడో తెలిపారు. జర్మనీకి ఉన్న ఒక ప్రయోజనం కలిగి ఉండిందని, మొదటి కరోనా కేసులు రిపోర్ట్ చేయబడినప్పుడు ప్రొఫెషనల్ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం జర్మనీ ప్రారంభించిందని  అడో చెప్పారు. “రాబోయే తుఫాను కోసం మా క్లినిక్లను సిద్ధం చేయడానికి ఇది మాకు కొంత సమయం ఇచ్చింది అని అడో తెలిపారు.

ముఖ్యంగా, జర్మనీ…. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను కూడా ప్రారంభంలోనే పరీక్షించడం ప్రారంభించింది. జర్మనీ యొక్క నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టాట్యూటరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫిజిషియన్స్ ప్రకారం….జర్మనీకి రోజుకు సుమారు 12,000 కరోనా టెస్ట్ లు చేయగలిగిన సామర్థ్యం ఉంది. అయితే వారానికి 160,000 పరీక్షలకు సామర్థ్యం ఉందని మరికొందరు తెలిపారు. దక్షిణ కొరియాలో పాటించిన విధంగా అధికమందిని జర్మనీ పరీక్షించనప్పటికీ… ప్రారంభ దశలో లక్షణాలు ఉన్నప్పటికీ, సోకిన వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నా లేదా రీసెంట్ గా హై రిస్క్ ఏరియా(ఇటలీలోని లొంబార్డీ,చైనాలోని వూహాన్ వంటివి)లను సందర్శించిన ప్రజలు టెస్ట్ చేయబడటానికి గైడ్ లైన్స్ ఒక నెలకు పైగా ఉన్నాయి. 

మొదటి కొన్ని వారాల్లో వైరస్ సోకిన వారి వయస్సు ప్రొఫైల్ ఇతర దేశాల కంటే చిన్నది. వారిలో చాలా మంది ఆస్ట్రియా లేదా ఇటలీలోని స్కీయింగ్ రిసార్ట్స్ నుండి తిరిగివచ్చిన ఫిట్,హెల్తీ(ఆరోగ్యకరమైన)ఫ్రొఫైల్ ఉన్నవాళ్లు. ఇది కూడా తక్కువ మరణాల రేటును వివరించడానికి  సహాయపడుతుంది. చాలా మంది యువ ఇటాలియన్లు గుర్తించబడకుండా వ్యాధి బారిన పడ్డారని అనుకుంటానని బెర్లిన్ లోని చారిటే ఆసుపత్రిలోని వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ అన్నారు. ఇటలీలో అధిక కరోనా మరణాల రేటును ఇది కూడా వివరిస్తుందన్నారు. జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా ఉన్న డ్రోస్టెన్… రాబోయే వారాల్లో జర్మనీ మరణాల రేటు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎందుకంటే హై రిస్క్ ఏరియాలను గుర్తించడం కష్టమవుతుందని డ్రోస్టెన్ తెలిపారు. కరోనా వైరస్ మరింత ప్రమాదకరంగా మారినట్లు కనిపిస్తుందని, కానీ ఇది గణాంక కళాకృతి, వక్రీకరణ అని తెలిపారు. 

డేటా సేకరణకు ఉపయోగించిన మెథడాలజీ కరక్టేనా!

జర్మనీ యొక్క డేటా సేకరణ వెనుక ఉన్న మెథడాలజీ… ఇటాలియన్ మరియు జర్మన్ వ్యక్తుల మధ్య వ్యత్యాసానికి దారితీస్తుంది. జర్మనీలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయితే… డాక్టర్ స్థానిక ఆరోగ్య అధికారికి విషయం తెలియజేస్తాడు. ఆ తర్వాత డేటాను డిజిటల్‌గా రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్‌(RKI)కు బదిలీ చేయబడుతుంది. ఈ ప్రాసెస్ లోని ఆలస్యం….దాని డేటా టేబుల్స్ ను తరచుగా అప్ డేట్ చేసే జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుంచి కన్నా RKI యొక్క రోజువారీ గణాంకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో వివరిస్తుంది. ఉదాహరణకు, ఆదివారం ఉదయం 10 గంటలకు, జర్మనీలో 55 మరణాలను మాత్రమే నమోదైనట్లు RKI పేర్కొంది.

ఇటలీలోలా కాకుండా, జర్మనీలో కరోనా వైరస్ కోసం ప్రస్తుతం విస్తృత పోస్టుమార్టం పరీక్షలు లేవు. ఎవరైతే వారి జీవితకాలంలో కోవిడ్ -19 కోసం పరీక్షించబడని, కానీ వైరస్ సోకినట్లు అనుమానించబడిన వారిని మరణం తరువాత పరీక్షించవచ్చని RKI చెబుతోంది. అయితే జర్మనీ యొక్క డీసెంట్రలైజ్డ్(వికేంద్రీకృత)ఆరోగ్య వ్యవస్థలో ఇది ఇంకా రొటీన్ ప్రాక్టీస్ కాదు. ఫలితంగా, టెస్ట్ చేయబడటానికి ముందే వారి వారి ఇళ్లలో మరణించిన, గణాంకాలలో చూపించని వ్యక్తులు ఉండవచ్చు అని సిద్ధాంతపరంగా చెప్పడం సాధ్యమే. అయితే గణాంకాలలో చూపించని పెద్ద సంఖ్యలో పరీక్షించని కరోనా-సంబంధిత మరణాలను సూచించే ఏ డేటాను నేను ఇంకా చూడలేదు అని అడో చెప్పారు. జర్మనీలో  శ్వాసకోశ జబ్బులను డీల్ చేసే క్లినిక్‌లు వారాలుగా వైరస్ గురించి చాలా అప్రమత్తంగా ఉన్నాయి, కాబట్టి నిర్దేశించని మరణాలలో గణనీయమైన సంఖ్య ఉంటే తాను చాలా ఆశ్చర్యపోతాను అని అడో చెప్పింది.

ఇటలీలోనే ఎక్కువ మరణాలు

మరోవైపు ఇటలీలో ఇప్పటివరకు 5వేల 500 కరోనా మరణాలు సంభవించాయి. ప్రపంచంలోనే ఎక్కువ కరోనా మరణాలు నమోదైంది ఇటలీలోనే. వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనా కంటే ఎక్కువ మరణాలు ఇటలీలో నమోదయ్యాయి. 

ఐసొలేషన్ కు జర్మనీ ఛాన్సలర్
మరోవైపు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్ ఛాన్సలర్‌ సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా లక్షణాలు బయటపడకపోయినా అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం న్యూమొకోకస్‌ బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ను ఆమె వేయించుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ ఎక్కించిన డాక్టర్ కు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఆమె క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

ప్రస్తుతానికి ఇంటి దగ్గరి నుంచే విధులు నిర్వహిస్తున్నారని, ఇప్పటికైతే ఆమెకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు వెల్లడించారు. జర్మనీలో వేగవంతంగా వైరస్‌ సంక్రమిస్తుండటంతో ప్రజలు గుమిగూడడంపై పూర్తిగా నిషేధం విధించారు. ఇద్దరికి మించి వ్యక్తులెవరూ ఒక చోటు ఉండడానికి వీల్లేదు. రెస్టారెంట్లు, ఫుడ్ సర్వీసులు ఓపెన్ చేసినప్పటికీ డెలీవరీ సర్వీసులు మాత్రమే పనిచేస్తున్నాయి. పనులు చేసుకోవడానికి, డాక్టర్లను కలిసేందుకు ప్రజలకు పూర్తి అనుమతులు ఉన్నాయి. బయట తిరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా 4అడుగుల దూరం మెయింటైన్ చేయాలని ఆంక్షలు విధించారు.