Girl Flying By Kite : OMG.. గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిపోయిన చిన్నారి, తర్వాత ఏం జరిగిందంటే…షాకింగ్ వీడియో

పతంగితో పాటు ఓ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోవడం కలకలం రేపింది. గాలిపటంతో పాటు ఆ చిన్నారి కూడా కాసేపు గాల్లో ఉండిపోయింది. దీంతో అంతా షాక్ అయ్యారు. చిన్నారిని కాపాడేందుకు తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Girl Flying By Kite : OMG.. గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిపోయిన చిన్నారి, తర్వాత ఏం జరిగిందంటే…షాకింగ్ వీడియో

Girl Flying By Kite : కైట్ ఫెస్టివల్.. మన దేశంలోనే కాదు చాలా దేశాల్లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్ లో రంగుల రంగుల పతంగులు ఎగరవేస్తారు. పిల్లలు, పెద్దలు అంతా పాల్గొంటారు. గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక సంక్రాంతి పండగ వచ్చిందంటే గాలిపటాలు ఎగరాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అంతా పతంగులు ఎగరేసి ఆనందిస్తారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా అంతా పతంగులు ఎగురేశారు. అయితే, పతంగితో పాటు ఓ చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపోవడం కలకలం రేపింది. గాలిపటంతో పాటు ఆ చిన్నారి కూడా కాసేపు గాల్లో ఉండిపోయింది. దీంతో అంతా షాక్ అయ్యారు. చిన్నారిని కాపాడేందుకు తంటాలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

పతంగితో పాటు పాప గాల్లోకి ఎగిరిన విషయం నిజమే. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. పాత ఘటన. రెండేళ్ల క్రితం తైవాన్ లో జరిగిందీ ఘటన. రెండేళ్ల కిందట తైవాన్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అందులో పాల్గొన్నారు. అంతా గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కైట్ తో పాటు చిన్నారి కూడా గాల్లోకి ఎగిరింది. కైట్ చివర్లో ఉండే క్లాత్ చిన్నారికి చుట్టుకోగా.. అది గమనించకుండా పతంగిని వదిలేశారు.

Also Read..China Manja : గొంతులు తెగుతున్నా మార్పు రావడం లేదు.. చైనా మాంజాపై చర్యలేవి?

అంతే చిన్నారితో సహా పతంగి గాల్లోకి ఎగిరిపోయింది. ఇది చూసినోళ్లు షాక్ తిన్నారు. అంతా టెన్షన్ పడ్డారు. అరుపులు, కేకలు వేశారు. పాపకు ఏమవుతుందోనని అంతా కంగారు పడ్డారు. పాప అంత ఎత్తు నుంచి ఎక్కడ పడుతుందోనని భయాందోళనకు గురయ్యారు. పాప కింద పడితే పట్టుకోవడానికి అంతా తమ చేతులు పైకి లేపారు. అయితే, ఎట్టకేలకు పాపను సురక్షితంగా రక్షించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండేళ్ల క్రితం తైవాన్ లో జరిగిన ఈ ఘటన వీడియో.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.