China Manja : గొంతులు తెగుతున్నా మార్పు రావడం లేదు.. చైనా మాంజాపై చర్యలేవి?

గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. చైనా మాంజా.. మనుషుల పాలిట యమపాశంగా మారింది. మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.

China Manja : గొంతులు తెగుతున్నా మార్పు రావడం లేదు.. చైనా మాంజాపై చర్యలేవి?

China Manja

China Manja : సంక్రాంతి పండుగ వేళ సరదా కోసం గాలిపటాలు ఎగరేస్తాం. అయితే, ఆ గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. చైనా మాంజా.. మనుషుల పాలిట యమపాశంగా మారింది. చైనా మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.

చైనా మాంజా మహా డేంజర్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. చైనా మాంజా ఉరితాడుగా మారుతోంది. చైనా మాంజా కారణంగా మంచిర్యాలలో గొంతు తెగి అక్కడికక్కడే భీమయ్య అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మరువక ముందే మాయదారి మాంజా మరో యువకుడికి మృత్యుపాశంగా మారింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దారుణం జరిగింది. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు

ఎజాజ్ అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా, చెట్టుకి చిక్కుకుపోయిన పతంగి మాంజా అతడి మెడకు చుట్టుకుంది. ఇది గమనించే లోపే అతడి గొంతు తెగింది. తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిన్న మంచిర్యాలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బైక్ పై భార్యతో కలిసి వెళ్తుండగా భీమయ్య మెడకు చైనా మాంజా చుట్టుకుంది. బైక్ వేగంగా వెళ్తుండటంతో అతడి గొంతు తెగింది. గాయం లోతుగా కావడం, రక్తస్రావం అధికంగా ఉండటంతో భీమయ్య స్పాట్ లోనే చనిపోయాడు. కళ్లెదుటే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటన అందరిని కలచివేసింది.

ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ, పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి. జనాల గొంతులు కోస్తున్న ఈ చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ చైనా మాంజా మార్కెట్ లో లభ్యమవుతోంది. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా చైనా మాంజా వాడకాన్ని మాత్రం ఆపడం లేదు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

కొన్నేళ్ల క్రితం కైట్స్ ఫెస్టివల్ సందర్భంగా చైనా మాంజా దేశానికి వచ్చింది. దాని పనితీరు చూసిన ఇక్కడి వ్యాపారులు సొంతంగా.. సింథటిక్ దారానికి గాజుపొడి అద్ది మాంజాను తయారు చేయడం ప్రారంభించారు. మాంజాలో గాజు ముక్కలను, ఇతర కెమికల్స్ ను కలుపుతున్నారు. దాంతో ఆ దారం కత్తిలా మారుతోంది. అదే ఇప్పుడు మనిషి పాలిట ఉరితాడుగా మారింది.