China Overtakes U.S : ప్రపంచంలో నెం.1 సంపన్న దేశంగా చైనా..తాజా రిపోర్ట్ లో కీలక విషయాలు

ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా ‘బ్లూమ్‌బర్గ్’ కథనం తెలిపింది. గడచిన 20 ఏళ్లలో ప్రపంచ సంపద(Global wealth)మూడు రెట్లు పెరిగిందని, అమెరికాను దాటుకుని

China Overtakes U.S : ప్రపంచంలో నెం.1 సంపన్న దేశంగా చైనా..తాజా రిపోర్ట్ లో కీలక విషయాలు

China (1)

China Overtakes U.S ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా ‘బ్లూమ్‌బర్గ్’ కథనం తెలిపింది. గడచిన 20 ఏళ్లలో ప్రపంచ సంపద(Global wealth)మూడు రెట్లు పెరిగిందని, అమెరికాను దాటుకుని చైనా తొలి స్థానానికి ఎగబాకిందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

గడిచిన రెండు దశాబ్దాలలో ప్రపంచ నికర విలువలో(Net Worth) చైనా.. దాదాపు మూడింట ఒక వంతు లాభాలను కలిగి ఉంది ప్రపంచ ఆదాయంలో 60శాతం కంటే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పది దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్‌లను పరిశీలిస్తున్న కన్సల్టెంట్స్.. మెకిన్సే & కో పరిశోధనా విభాగం ఈ నివేదిక ఇచ్చినట్లు తెలిపింది.

ప్రపంచపు కొత్త సంపద

ప్రపంచ నెట్ వర్త్ 2020లో అనూహ్యంగా 514 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2000లో ఇది 156 ట్రిలియన్ డాలర్లుగా ఉండిందని తాజా రిపోర్ట్ తెలిపింది. చైనాకు అత్యధిక వాటా లభించిందని, ప్రపంచ ఆదాయంలో దాదాపు మూడో వంతు చైనా సొంతమైందని పేర్కాంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో(WTO) చేరడానికి ముందు 2000వ సంవత్సరంలో చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండేదని, ప్రస్తుతం ఇది 120 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపింది. ఇదే కాలంలో అమెరికా నెట్‌వర్త్ రెట్టింపు (90 ట్రిలియన్ డాలర్లు) అయిందని తెలిపింది.

చైనా, అమెరికా ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలని తెలిపింది. అయితే ఈ రెండు దేశాల్లో కూడా మూడింట రెండొంతుల సంపద కేవలం 10 శాతం కుటుంబాల వద్దే ఉందని ఈ నివేదిక తెలిపింది. ఈ సంపన్న కుటుంబాల వాటా మరింత పెరుగుతూ ఉందని తెలిపింది. ఇక, 68 శాతం గ్లోబల్ నెట్ వర్త్ రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ALSO READ PM Modi : పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే ప్రారంభించిన మోదీ..హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు