Google Employees : గూగుల్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. నో వ్యాక్సిన్.. ఇంట్లోనే పనిచేస్తాం!

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఆ సంస్థ ఉద్యోగులు షాకిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగులు వ్యాక్సినేషన్ తప్పనిసరి పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు.

Google Employees : గూగుల్‌కు షాకిచ్చిన ఉద్యోగులు.. నో వ్యాక్సిన్.. ఇంట్లోనే పనిచేస్తాం!

Google Employees Are Unhappy With Mandatory Vaccine Policy

Google Employees : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఆ సంస్థ ఉద్యోగులు షాకిచ్చారు. వర్క్ ఫ్రమ్ హోంలో ఉద్యోగులు వ్యాక్సినేషన్ తప్పనిసరి పాలసీని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు..  వర్క్ ఫ్రమ్ హోంను మరింత కాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. గూగుల్ సంస్థ ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ కంపెనీకి వ్యతిరేకంగా మ్యానిఫెస్టోను కూడా రెడీ చేశారు. వ్యాక్సినేషన్‌ తప్పనిసరిపై వందల మంది సంతకాలతో మేనిఫెస్టోతో నిరసనలకు దిగారు. ఇప్పుడా ఆ మేనిఫెస్టో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పుడా ఆ సంతకాల సంఖ్య పెరిగిపోతోంది. త్వరలో వర్క్‌ఫ్రమ్‌ హోం ముగియనుంది. గూగుల్ ఉద్యోగులంతా తిరిగి ఆఫీసులకు రావాల్సి ఉంది. పూర్తి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ గూగుల్ ఆదేశాలు జారీ చేసింది. కానీ, వర్క్ ఫ్రమ్ ఉద్యోగులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. ఈ నేపథ్యంలో బైడెన్‌ ప్రభుత్వం అమెరికన్‌ కంపెనీలకు కఠినంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ కంపెనీలో వంద, అంతకంటే ఎక్కువ మంది వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకుని ఉండాల్సిందే. అయితే కంపెనీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలి. జనవరి 4వ తేదీని అక్కడి ప్రభుత్వం డెడ్‌లైన్‌గా విధించింది. గూగుల్‌ తమ కంపెనీలో పని చేసే లక్షా యాభై వేల మంది ఉద్యోగులకు మెయిల్‌ పంపింది. ఆఫీసులకు వచ్చినా, వర్క్‌ఫ్రమ్‌ హోంలో ఉన్నా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. అంతేకాదు.. డిసెంబర్‌ 3వ తేదీకల్లా వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ను కంపెనీ ప్రొఫైల్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆదేశించింది.

వ్యాక్సిన్ ‘తప్పనిసరి’ పాలసీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా అనేది తమ నిర్ణయమని, అది తమకు స్వేచ్ఛ వదిలేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరి విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. కరోనా ప్రభావం కారణంగా.. మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్‌ హోంలోనే కొనసాగుతామని అంటున్నారు. అవసరమైతే తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తామని అంటున్నారు.

Read Also : International Flights : మరికొద్ది రోజుల్లోనే..సాధారణ స్థితికి అంతర్జాతీయ విమాన సేవలు!