గూగుల్ మ్యాప్‌లో COVID-19 అలర్ట్

  • Published By: Subhan ,Published On : June 9, 2020 / 01:05 AM IST
గూగుల్ మ్యాప్‌లో COVID-19 అలర్ట్

గూగుల్ మ్యాప్‌లో మరో ఫీచర్ యాడ్ కానుంది. COVID-19 సంబంధించిన ట్రావెల్ నిబంధనలు అందులో కనిపించనున్నాయి. కంటోన్మెంట్ జోన్ సింబల్స్ ముందుగానే కనిపించడంతో పాటు బెటర్ గా ఉండేందుకు టిప్స్ కూడా ఇవ్వనుంది. లేటెస్ట్‌గా యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ పొందవచ్చు. 

ఇందులో మరో ఫీచర్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో ఎంత రద్దీగా ఉందీ.. ట్రైన్ ఏ టైమ్ కు రానుంది. బస్సులు సరైన సమయానికి ఏ రూట్లో వస్తున్నాయనేది కూడా గూగుల్ చెప్పేస్తుంది. ఈ అలర్ట్‌ను అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు ఇతర దేశాల్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. 

కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ లాంటి దేశ సరిహద్దులు వద్ద COVID-19 checkpoints, నిబంధనలు కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండన్నాయి. కొద్ది నెలలుగా 131 దేశాల్లోని గూగుల్ యూజర్ ఫోన్ల నుంచి డేటాను సేకరించి లాక్‌డౌన్, హెల్త్ అథారిటీ విషయాలు, సోషల్ డిస్టెన్సింగ్ తో పాటు ఇతర ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ మేరకు గూగుల్ బిలియన్ డాలర్లు వెచ్చించింది. వరల్డ్ డిజిటల్ మ్యాప్ పై యాడ్ ల ద్వారా తిరిగి రెవెన్యూ సంపాదించుకోవాలని ప్లాన్. ఫ్రీ నేవిగేషన్ యాప్‌తో ప్రతి నెలా 1బిలియన్ యూజర్లను సంపాదించుకోగలుగుతుంది గూగుల్.