Solar Energy Cloth : అద్భుత ఆవిష్కరణ.. సౌర శక్తితో విద్యుత్తును తయారు చేసే వస్త్రం

ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో అంగీ, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను జేబులో పెట్టేసి చార్జింగ్‌ చేసుకోవచ్చు.

Solar Energy Cloth : అద్భుత ఆవిష్కరణ.. సౌర శక్తితో విద్యుత్తును తయారు చేసే వస్త్రం

solar energy cloth

Solar Energy Cloth : ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేశారు. ఆ వస్త్రంతో అంగీ, ప్యాంటు కుట్టించుకొంటే సరి. ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను జేబులో పెట్టేసి చార్జింగ్‌ చేసుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చి, వస్త్రాన్ని అల్లారు. ఆ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌర శక్తిని గ్రహించేలా చేశారు.

దాంతో అవి 400 మిల్లీవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్తు సెల్‌ఫోన్‌ చార్జింగ్‌కు సరిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకొచ్చని వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేస్తామని వెల్లడించారు.

Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు

51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని పరిశోధకులు తయారు చేశారు. నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్‌ సెల్‌ను పాలిమర్‌ రెజిన్‌ కోటింగ్‌ చేసి వాటర్‌ప్రూఫ్‌గా మార్చారు. ఒక్కో సోలార్‌ సెల్‌ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్‌ సెల్‌ తీగను అమర్చుకొంటూ వస్త్రాన్ని తయారు చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.