Wedding Guests Fight : పెళ్లిలో లొల్లి.. నడిరోడ్డుపై ఎలా కొట్టేసుకున్నారో చూడండి.. !
పెళ్లిలో గొడవలు జరగడం కామన్.. వరుడి బంధువులతో వధువు బంధువులకు గొడవకు దిగడం.. చివరికి అది పెళ్లి పెటాకులు అయ్యే వరకు దారితీస్తుంటుంది.

Guests At Reception In Australia Get Into Street Brawl In Viral Video
Wedding Guests Fight : పెళ్లిలో గొడవలు జరగడం కామన్.. వరుడి బంధువులతో వధువు బంధువులకు గొడవకు దిగడం.. చివరికి అది పెళ్లి పెటాకులు అయ్యే వరకు దారితీస్తుంటుంది. ఇలాంటి ఘటనలు సాధారణంగా చాలా పెళ్లి వేడుకల్లో కనిపిస్తుంటాయి. పెళ్లి వేడుకల్లో జరిగే గొడవలు చిన్నవే అయినా.. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతుంటారు.
ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది. పెళ్లికి వచ్చిన బంధవులు నడిరోడ్డుపై దారుణంగా కొట్టేసుకున్నారు. సినిమా సీన్ తలపించేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. సిడ్నీ సబర్బ్‌లోని అప్ మార్కెట్లో వివాహ వేడుక జరిగింది. ఆ పెళ్లి వేడుక సమయంలో ఎంతో సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా ఒకరిపై మరొకరు కొట్టేసుకున్నారు.
ముందుగా చిన్న గొడవతో మొదలైంది.. ఒకరిని మరొకరు నెట్టుకుంటూ కొట్టుకున్నారు. కొందరు అయితే నడిరోడ్డుపైకి వచ్చి మరి కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ముక్కుపై బలంగా తగలడంతో స్పృహ తప్పి రోడ్డుపై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయినప్పటికీ గొడవ ఆగలేదు. ఒకరిపై మరొకరు దూసుకెళ్లి కొట్టుకున్నారు. సిడ్నీలోని ఉత్తర తీరంలోని మోస్మాన్‌లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
Read Also : Kacha Badam Song : వామ్మో.. ‘కచ్చా బాదం’ అసలే అమ్మను.. నేను సెలబ్రిటీని.. కనిపిస్తే కిడ్నాప్ చేస్తారేమో..!