Kacha Badam Song : వామ్మో.. ‘కచ్చా బాదం’ అసలే అమ్మను.. నేను సెలబ్రిటీని.. కనిపిస్తే కిడ్నాప్ చేస్తారేమో..!

ఇతడో సోషల్ మీడియా సెన్సేషన్. వీధుల్లో తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే ఈ వ్యక్తి స్టార్ డమ్ సంపాదించాడు. కచ్చా బాదం సింగర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు.

Kacha Badam Song : వామ్మో.. ‘కచ్చా బాదం’ అసలే అమ్మను.. నేను సెలబ్రిటీని.. కనిపిస్తే కిడ్నాప్ చేస్తారేమో..!

Kacha Badam Singer I’m A Celebrity Now, Won’t Have To Sell Peanuts Now Onwards

Kacha Badam Song : ఇతడో సోషల్ మీడియా సెన్సేషన్. వీధుల్లో తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముకునే ఈ వ్యక్తి స్టార్ డమ్ సంపాదించాడు. కచ్చా బాదం సింగర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అతడే ఈ భువన్ బద్యాకర్.. ఎక్కడ చూసినా ఇతడి పాటే ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలబ్రిటీగా మార్చేస్తుందో ఊహించడం కష్టమే.. పల్లీలు (కచ్చా బాదం) అమ్ముకునే ఈ వీధి వ్యాపారి లైఫ్ కూడా ఒక పాటతో టర్న్ అయింది. ఈ పాటకు బాలీవుడ్‌లో ఎక్కడలేని క్రేజ్‌ వచ్చేసింది. భువన్ బద్యాకర్… ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, టెలివిజన్‌ రియాలిటీ షోలు, లైవ్‌ షోలు, కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయిపోయాడు.. గెటప్ తో పాటు స్టయిల్ కూడా మార్చేశాడు. కోల్‌కతాలోని నైట్‌ క్లబ్‌లో లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌ కచ్చా బాదం పాట పాడుతూ కనిపించాడు.

ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రజలంతా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ పాట వైరల్ అయినప్పటి నుంచి తాను బయటకు వచ్చి కచ్చా బాదం అమ్మడం లేదన్నాడు. ఈ పాటతో తనకు క్రేజ్ రావడంతో తన సన్నిహితులు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఒంటరిగా తాను బయటకు వెళ్తే.. ఎవరైనా నన్ను కిడ్నాప్ చేస్తారేమోనని హెచ్చరించినట్టు బద్యాకర్ చెప్పాడు. ఇకపై మీ లైఫ్ ఎలా లీడ్ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు.. ఇప్పుడు నేను సెలబ్రిటీనయ్యాను.. కళాకారుడిగా ఇలానే ముందుకు కొనసాగుతాను.

నేను బయటకెళ్లి పల్లీలు అమ్మితే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ వీధి వ్యాపారిగా జీవనం కొనసాగించేవాడు. తన బైకుపై పల్లీల మూట వేసుకుని వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు విక్రయిస్తుండేవాడు. పల్లీలు అమ్మేందుకు అతడు కొనుగోలు చేసేవారి నుంచి పాత, పాడైన వస్తువుల్ని తీసుకునేవాడు. వాటికి తీసుకుని పచ్చి పల్లీలు ఇస్తుండేవాడు. పాత సామాన్లు, పాడైన మొబైల్‌ఫోన్లను తీసుకునేవాడు.

ఇలా ఇచ్చిన పాత వస్తువులకు పచ్చి పల్లీలు ఇస్తాననే అర్థం వచ్చేలా లిరిక్స్‌ కూడా రాసుకున్నాడు. అదే.. ‘కచ్చా బాదం’ దీనికి ట్యూన్‌ కట్టాడు. కొన్ని నెలల క్రితం భువన్‌ బద్యాకర్ ఈ పాట పాడుతుండగా.. ఓ యూట్యూబర్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు పెట్టాడు. అంతే.. ఆ వీడియో తెగ వైరల్ గా మారింది. మోడల్‌ అంజలి అరోరా ఆ కచ్చా బాదం పాటకు డాన్సు వేసి వీడియోను పోస్టు చేయడంతో ఆ వీడియో మరింత వైరల్ అయింది. ఫుల్ క్రేజ్‌ రావడంతో నెటిజన్లు కూడా కచ్చా బాదం పాటకు అంజలి అరోరా స్టెప్పులు వేస్తూ రీల్స్‌ చేసేస్తున్నారు.

అంతటితో ఆగకుండా ఈ పాట క్రేజ్ దేశవిదేశాలకు సైతం పాకింది. భువన్‌ బద్యాకర్ పాడిన ఈ పాటకు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్‌ సంస్థ ర్యాప్‌ సాంగ్‌ పాడించింది. ఆ లిరిక్స్‌కు ర్యాప్‌ను యాడ్ చేసింది. ఈ పాటను పాడే క్రమంలో బద్యాకర్ డ్రెసింగ్ స్టయిల్ కూడా మార్చేచి పాటను పాడించారు. మోడ్రన్‌ అమ్మాయితో కూడా డాన్స్‌ చేయించారు. యూట్యూబ్‌లో ఈ పాటను రిలీజ్ చేయగా.. 7.6 కోట్ల మందికి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ నెట్టింట్లో ఈ కచ్చా బాదం సాంగ్ క్రేజ్ తగ్గలేదు.. రోజురోజుకీ కొత్త కొత్త వీడియోలతో కచ్చా బాదం సాంగ్ ను మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

Read Also : Kacha Badam : ‘కచ్చా బాదమ్’ సింగర్ భుబన్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్..! అతడి కష్టానికి ఇంతేనా?