‘Gummy Squirrel’in Pacific Ocean : తొక్క తీసిన అరటిపండులా ఉన్న‘సీ కుకుంబర్’ పసిఫిక్‌ సముద్రంలో చిత్రమైన జీవులు గుర్తింపు

పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు కొన్ని అరుదైన జీవులను గుర్తించారు. వాటిలో ఒకటి ‘తొక్క తీసిన అరటిపండు’లా ఉంటే..మరొకటి తులిప్ పుష్పం లా ఉంది. ఇలా ఎన్నో అరుదైన జీవుల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

‘Gummy Squirrel’in Pacific Ocean : తొక్క తీసిన అరటిపండులా ఉన్న‘సీ కుకుంబర్’ పసిఫిక్‌ సముద్రంలో చిత్రమైన జీవులు గుర్తింపు

‘Gummy Squirrel’in Pacific Ocean : ఈ భూమి ఎన్నో అద్భుతమైన జీవులకు ఆలవాలంగా ఉంది. వాటిలో గుర్తించినవి అతి కొన్నే. ఇంకా మనిషి కంటపడని అరుదైన..అద్భుతమైన జీవులెన్నో ఉన్నాయి. అటువంటి జీవులను గుర్తించే పనిలో ఎంతోమంది శాస్త్రవేత్తలు బిజీ బిజీగా ఉంటారు. దీంట్లో భాగంగా పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు కొన్ని అరుదైన జీవులను గుర్తించారు. వాటిలో ఒకటి ‘తొక్క తీసిన అరటిపండు’లా ఉంటే..మరొకటి తులిప్ పుష్పం లా ఉంది. ఇలా ఎన్నో అరుదైన జీవుల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.

Gummy squirrel' found in deep-sea abyss looks like a stretchy half-peeled  banana | Live Science

లండన్ కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం (NHM) శాస్త్రవేత్తలు పసిఫిక్ మహా సముద్రం అడుగున ఈ వింత జీవులను గుర్తించారు. సీ కుకుంబర్ జాతి జీవులు సాధారణమే అయినా.. అందులో సరికొత్త రకమైన దీన్ని గుర్తించడం ఇదే తొలిసారి. దీనికి శాస్త్రవేత్తలు ‘గమ్మీ స్వ్కిరెల్’ (‘Gummy squirrel’)అని పేరు పెట్టారు. సన్నగా పొడుగ్గా పసుపు పచ్చ రంగులో ఉన్న ఈ జీవికి తోక ఆకారంలో పెద్ద టెంటకిల్ ఉంది. దాని శరీరానికి కింద పెద్ద సంఖ్యలో కాళ్లు ఉన్నాయి. ఫొటోలో చూడటానికి చిన్నగా కనిపిస్తోందిగానీ.. ఈ గమ్మీ స్వ్కిరల్ రెండు అడుగుల పొడవు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Gummy squirrel' found in deep-sea abyss looks like a stretchy half-peeled  banana | Archaeology

శాస్త్రవేత్తలు ఒక కేబుల్ సాయంతో సముద్రం అడుగు వరకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీస్తూ పరిశోధన చేయగలిగే మరిన్ని అద్భుతమైన జీవులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే శాంపిల్స్ సేకరించగలిగే ‘రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (EOV) సాయంతో నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అమెరికా తీరంలోని హవాయి నుంచి మెక్సికో మధ్య సగటున ఐదు కిలోమీటర్ల (16,400 అడుగుల) లోతున సముద్రపు నేలపై జీవులను పరిశీలిస్తూన్నారు. ఈ క్రమంలో అత్యంత చిత్రమైన, ఎన్నడూ చూడని సరికొత్త జీవులను గుర్తించారు. వాటి జన్యుక్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కొన్ని జీవులు లక్షల ఏళ్లుగా పరిణామం చెందకుండా, అచ్చం వాటి పూర్వపు జీవులు ఉన్నట్లుగా ఉన్నాయని కనుగొన్నారు.

Gummy squirrel' found in deep-sea abyss looks like a stretchy half-peeled  banana - Sd Pict

తులిప్ పుష్పం లాంటి సీ స్పాంజ్
పసిఫిక్ సముద్రం అడుగున శాస్త్రవేత్తలు గుర్తించిన మరో చిత్రమైన జీవి ‘సీ స్పాంజ్’. సముద్ర స్పాంజ్ ల జాతికి చెందిన ఈ జీవి తెలుపు రంగులో అచ్చం తులిప్ పువ్వులా ఉంది. ఈ జీవికి ‘హ్యలోనెమా’ అని పేరు పెట్టారు. భూమి నుంచి ఓ కాడ పైకి ఎదిగి దానికి తులిప్ పుష్పం విరబూస్తే ఎలా ఉంటుందో అచ్చంగా ఈ మ్యోలోనెమా కూడా అలాగే ఉంది. సముద్రంలో తులిప్ పువ్వు పూసిందా అనేలా ఉంది. ఈ జీవి పొడవాటి కాడ వంటి నిర్మాణంతో సముద్రం అడుగున నేలకు అనుసంధానమై.. ప్రధాన భాగం నీటి మధ్యలో వేలాడుతున్నట్టుగా ఉండటం విశేషం.