Hawaii fires: అమెరికాలోని హవాయిలో కార్చిచ్చు బీభత్సం.. 36 మంది సజీవ దహనం
హెలికాప్టర్ల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Hawaii fires
Hawaii fires – Maui island: అమెరికా (USA) హవాయిలోని మౌయి ద్వీపంలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. కార్చిచ్చు ధాటికి 36 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. హరికేన్ (hurricane) వల్ల బలమైన గాలులు వీస్తుండడంతో కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే అనేక భవనాలు, వాహనాలు కాలిపోతున్నాయి. 200కు పైగా భవనాలు అక్కడి ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలు సరిగ్గా జరగడం లేదు. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మౌయి ద్వీపంలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు.
పలువురు స్థానికుల ఆచూకీ తెలియడం లేదు. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మంటల ధాటికి నిస్సహాయ స్థితిలో సహాయక బృందాల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని కొందరు అన్నారు. హెలికాప్టర్ల ద్వారా పెద్ద ఎత్తున నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.