Pakistan : పాకిస్థాన్‌లో 18 ఏళ్ల‌ హిందూ యువతి కాల్చివేత..

పాకిస్థాన్ లో 18 ఏళ్ల హిందూ అమ్మాయిని దుండ‌గులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో రోహి పట్టణం సుక్కూర్‌లో యువతిని అపహరించటానికి యత్నించారు. ప్రతిఘటించటంతో కాల్చి చంపేశారు.

Pakistan : పాకిస్థాన్‌లో 18 ఏళ్ల‌ హిందూ యువతి కాల్చివేత..

Hindu Girl Shot Dead In Pakistan

Hindu girl shot dead in Pakistan: పాకిస్థాన్ లో 18 ఏళ్ల హిందూ అమ్మాయిని దుండ‌గులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో రోహి పట్టణం సుక్కూర్‌లో ఈ ఘ‌ట‌న జరిగింది. పాకిస్థాన్ లో హిందూ యువ‌తుల‌ను కిడ్నాప్ చేయటం..వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చటం,ముస్లిం యువకులతో పెళ్లి చేయటంలో జరుగుతోంది. ఈక్రమంలో రోహి పట్టణం సుక్కూర్‌లో ఓ హిందూ అమ్మాయిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయటానికి యత్నించారు. కానీ ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ప్రతిఘటించటంతో ఈ విషయం భయపడుతుందన సదరు దుండగులు ఆమెన కాల్చి చంపేసినట్లుగా ది ప్రైడే టైమ్స్ వార్తా పత్రిక వెల్లడించింది.

ఇటువంటి ఘటనలు పాకిస్థాన్ లో జరుగుతునే ఉన్నాయి. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను కిడ్నాప్ చేయటం..వారిని బలవంతంగా మతమార్పిడి చేయటం..ముస్లిం యువకులకు ఇచ్చి వివాహాలు చేయటం జరుగుతోంది. ఇలా ప్రతీ ఏటా వందలాదిమంది యువతులు ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నారు. పాకిస్థాన్ లో మైనారిటీ వర్గాలు బలవంతపు వివాహాలు, బలవంతపు మతమార్పిళ్లు ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల సంఘ నేతలు తెలిపారు.

హిందువులపై ఇతర మైనారిటీలపై జరుగుతున్న ఇటువంటి ఘటనల గురించి పాకిస్థాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనికి సంబంధించి పాక్ బిల్లును కొంతమంది వ్యతరికించారు. వారివి బలవంతపు వివాహాలు కాదని..ముస్లిం యువకులను ప్రేమించి చేసుకునేవేనని చెబుతు బిల్లును వ్యతిరేకించారు కొంతమంది.

2013- 2019 మధ్య 156 బలవంతపు మతమార్పిళ్ల ఘ‌టనలు చోటు చేసుకున్నాయ‌ని పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ఓ నివేదిక‌లో పేర్కొంది. పాక్‌లో హిందువుల జనాభా 1.60 శాతంగా ఉండ‌గా, వారి మొత్తం జ‌నాభాలో సింధ్ ప్రాంతంలో అత్యధికంగా 6.51 శాతం మంది ఉన్నారు. వారికి మ‌తవాదుల నుంచి త‌రుచూ వేధింపులు ఎదుర‌వుతున్నాయి.