Pakistan Crisis: కుడి చేతిలో ఖురాన్, ఎడమ చేతిలో అణుబాంబ్.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు

తెహరీక్-ఈ-లబ్బాయిక్ పార్టీని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. సాద్ రిజ్వీ పేరును కూడా అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో వేశారు. అయితే ఆ జాబితా నుంచి తొలగించాలని, లాహోర్ జైలులో ఉన్న ఆయనను విడుదల చేయాలని 2021లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఈ పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అనంతరం, విడుదల చేశారు.

Pakistan Crisis: కుడి చేతిలో ఖురాన్, ఎడమ చేతిలో అణుబాంబ్.. పాక్ నేత సంచలన వ్యాఖ్యలు

Hold Quran in your right hand, atom bomb in left says Pak leader for economic crisis

Pakistan Crisis: పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Aaditya Thackeray: దమ్ముంటే నామీద పోటీ చెయ్.. సీఎం షిండేకు ఆదిత్య థాకరే సవాల్

కాగా, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడేందుకు ఒక దారుణమైన పరిష్కారాన్ని పాకిస్థాన్‭కు చెందిన సాద్ రిజ్వీ అనే నేత ఒకరు సూచించారు. ఏంటటా అంటే.. కుడి చేతిలో ఖురాన్, ఎడమ చేతిలో అణుబాంబు తీసుకుని వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రిజ్వీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. యుద్ధాల వల్ల గుణపాఠం నేర్చుకున్నామని, ఉగ్రవాదానికి బీజాలు నాటింది మనమేనని ఆ దేశ ప్రధాన మంత్రి, మరో మంత్రి చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఆ నేత వ్యాఖ్యలు ఉండడం పట్ల నెటిజెన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు.

Supreme Court: కొలీజియం సిఫారసుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఐదుగురు జడ్జీల నియామకం

తెహరీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ పార్టీకి చెందిన సాద్ రిజ్వీ.. తాజాగా లాహోర్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇతర దేశాలకు వెళ్లి బిచ్చమెత్తడానికి బదులుగా, అణుబాంబు తీసుకెళ్లి, నిధులు అడగాలి. ప్రధాన మంత్రి షరీఫ్ ఆర్థిక సాయం కోసం తన కేబినెట్ మంత్రులను, ఆర్మీ చీఫ్‌ను ఇతర దేశాలకు పంపిస్తున్నారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందని వాళ్లు చెప్తున్నారు. దీనికి బదులుగా నేను వారికి ఓ సలహా ఇస్తున్నాను. కుడి చేతితో ఖురాన్‌ను పట్టుకుని, ఎడమ చేతిలో అణుబాంబు సూట్‌కేసుతో స్వీడన్ వెళ్లి, మేము ఖురాన్‌ను కాపాడటానికి వచ్చామని చెప్పాలి. అప్పుడు ఈ విశ్వమంతా మీ కాళ్ళ క్రిందకు రాకపోతే, మీరు నా పేరు మార్చండి’’ అని అన్నారు.

Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

తెహరీక్-ఈ-లబ్బాయిక్ పార్టీని గతంలో పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించింది. సాద్ రిజ్వీ పేరును కూడా అనుమానిత ఉగ్రవాదుల జాబితాలో వేశారు. అయితే ఆ జాబితా నుంచి తొలగించాలని, లాహోర్ జైలులో ఉన్న ఆయనను విడుదల చేయాలని 2021లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఈ పార్టీ నేతలు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అనంతరం, విడుదల చేశారు.