Supreme Court: కొలీజియం సిఫారసుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఐదుగురు జడ్జీల నియామకం

కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం రగడ రగులుతున్న నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా అయితే ఒక ఫైలు క్లియర్ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపదు. కానీ ఈ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి పంపించిన ఫైలును కేంద్రం క్లియర్ చేయకముందే, మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేస్తూ కేంద్రానికి ఫైలు పంపింది కొలీజియం

Supreme Court: కొలీజియం సిఫారసుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఐదుగురు జడ్జీల నియామకం

Centre clears appointment of 5 new judges to Supreme Court

Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. దీంతో సుప్రీంకోర్టుకు మరో ఐదుగురు న్యాయమూర్తులు నియామకం అయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గత నెల 13న ఈ నియామకాల కోసం సిఫారసు చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఫిబ్రవరి 2న ఈ సిఫారసులకు ఆమోదం తెలిపి, ఆ ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పంపింది. రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఐదుగురు న్యాయమూర్తులు వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. వీరి నియామకాలకు వారంట్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ శనివారం జారీ అయితే, వీరంతా వచ్చే వారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Supreme Court: ఏ కేసూ కోర్టుకు పెద్దది కాదు, చిన్నదీ కాదు.. సీజేఐ చంద్రచూడ్

కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొలీజియం రగడ రగులుతున్న నేపథ్యంలో ఈ సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే.. మామూలుగా అయితే ఒక ఫైలు క్లియర్ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపదు. కానీ ఈ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి పంపించిన ఫైలును కేంద్రం క్లియర్ చేయకముందే, మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేస్తూ కేంద్రానికి ఫైలు పంపింది కొలీజియం. ఈ రెండో సిఫారసును జనవరి 31న పంపారు. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని తాజా సిఫారసులో కొలీజియం సూచించింది.