Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Pakistan Crisis : పతనం అంచున పాకిస్తాన్.. కేవలం 18రోజులకు సరిపడ విదేశీ మారకపు నిల్వలు

Pakistan Crisis : పొరుగు దేశం పాకిస్తాన్ నిధుల కొరతతో అల్లాడుతోంది. ఆ దేశంలో విదేశీ మారకపు నిల్వలు(ఫారిన్ ఎక్స్ చేంజ్ రిజర్వ్స్) భారీగా క్షీణించి పదేళ్ల కనిష్టానికి చేరాయి. ప్రస్తుతం విదేశీ మారకపు నిల్వలు 16.1 శాతం క్షీణించి 3.09 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తెలిపింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రుణ చెల్లింపుల వల్ల 592 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు క్షీణించినట్లు సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఆ దేశ కమర్షియల్ బ్యాంకుల వద్ద ఉన్న 5.65 బిలియన్ డాలర్లతో కలుపుకుంటే మొత్తం విదేశీ మారకపు నిల్వలు 8.74 బిలియన్ డాలర్లు పాక్ వద్ద ఉన్నాయి. మరోవైపు నగదు కొరతతో అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం.. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి నిధులు పొందేందుకు నానా తంటాలు పడుతోంది.

Also Read..Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..

ఒకసారి 7 బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజ్ మంజూరు చేస్తే ఇతర వేదికల నుంచి, స్నేహపూర్వక దేశాల నుంచి నిధులు పొందేందుకు పాక్ కు వీలవుతుంది.

Also Read..Pakistan Economy: అందుకే పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం: అమెరికా, పాక్ అధికారులు

ఇప్పటికే నిధుల విడుదలకు ఐఎంఎఫ్ కొన్ని షరతులు విధించింది. చమురు సబ్సిడీల్లో కోత పెట్టాలని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారకపు విలువను సవరించాలని సూచించింది. ఈ రెండు షరతులకు ఇప్పటికే పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక, చమురు ధరలను ఏకంగా 16శాతం మేర పెంచింది. రూపాయి మారకంపై ఉన్న పరిమితిని తొలగించింది. దీంతో ప్రస్తుతం ఇంటర్ బ్యాంక్ మార్కెట్ లో పాక్ రూపాయి విలువ 270 వద్ద ట్రేడ్ అవుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.