ముందుచూపు : చైనా పక్కనే..అయినా ఆ దేశం కరోనాను కట్టడి చేసింది..ఎలా

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 02:21 AM IST
ముందుచూపు : చైనా పక్కనే..అయినా ఆ దేశం కరోనాను కట్టడి చేసింది..ఎలా

ప్రపంచాన్ని కరోనా వైరస్ తెగ భయపెడుతోంది. అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. చైనా నుంచి ఈ వచ్చిన భూతం..ప్రపంచ దేశాలకు పాకుతోంది. వేలాది మంది బలవతున్నారు. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే..ఓ చిన్న దేశంపై అందరి దృష్టి నెలకొంది. కరోనా రాకాసిని ఆ దేశం విజయవంతంగా అడ్డుకోగలిగింది. అది కూడా..చైనా పక్కనే ఉంది.

కేసులు మాత్రం నమోదవుతున్నాయి. కానీ..అవి వందల సంఖ్యలోనే ఉండడం..మృతుల సంఖ్య జీరోగా ఉండడంతో అందరి చూపు ఆ దేశంపై పడింది. ఆ దేశమే..వియత్నాం. వియత్నాం అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు తీసుకున్న చర్యల వల్ల ఆ దేశ ప్రజలు సేఫ్ జోన్ లో ఉన్నారు. అసలు ఈ వైరస్ ని ఎలా అరికట్టగలిగిందనే సమాచారం తెలుసుకోవడం గురించి..తెగ వెతుకుతున్నారు. 

వియత్నాం..ఇక్కడ వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా అని చెప్పవచ్చు. హోచిమిన్ సిటీ రాజధాని. ఈ నగర జనాభ 8 మిలియన్లు. చైనాలో ప్రధాన నగరాల్లో ఒకటైన వుహాన్ లో 2019 చివరిలో కరోనా వైరస్ పుట్టింది. పక్కనే ఉన్న వియత్నాం అప్పుడే అలర్ట్ అయ్యింది. ముందే వైద్య  సౌకర్యాలు అంతంతమాత్రమే. దీంతో ముందే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

వియత్నాంలో జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో అమలు చేశారు. జనవరి 20వ తేదీ నుంచి చైనా లాక్ డౌన్ స్టార్ట్ చేయడం ప్రారంభించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. పొరుగునే ఉన్న చైనాలో పుట్టిన ఈ వైరస్ తమ దేశ ప్రజలకు ఎవరికి సోకిందనే దానిపై ఆరా తీశారు. వారిని వెతికి పట్టుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యుల పాత్ర చాలా కీలకంగా మారింది.

ఇది ఒక విధంగా చెప్పాలంటే ఉద్యమంలా సాగింది. మొదట వ్యాధి గ్రస్తులను గుర్తించారు. వారిని ఎటూ వెళ్లకుండా నిర్భందించారు. వీరు ఎవరెవరితో తిరిగారు ? ఎవరితో సన్నిహితంగా ఉన్నారు ? ఇతర విషయాలపై ఆరా తీశారు. వారిని కూడా ఎక్కడకు వెళ్లకుండా ఒక్క దగ్గరనే ఉంచారు. 

కరోనా బాధితులు తిరిగిన రూట్ ను..కలుసుకున్న వారిని..నాలుగు అంచెలుగా విభజించారు. అందరికీ పరీక్షలు నిర్వహించారు. నెగటివ్ వస్తే..వారిని హౌస్ అరెస్ట్ చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా మొదట అడ్డుకున్నారు. అనంతరం అనేక ప్రాంతాల్లో లాక్ డౌైన్ విధించారు. మూడు వారాలు, నెల రోజులు దీనిని అమల్లో పెట్టింది. కొత్తగా కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేశారు. లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఉద్దీపన పథకాలను ప్రకటించింది. 

ఇందులో ప్రధానమైంది. ప్రజలను చైత్యవంతం చేసింది. విస్తృతంగా ప్రచారం చేసింది. వారిని ఆలోచింపచేసే విధంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. అందులో భాగంగా శానిటైజర్లు, మాస్క్ లు విపరీతంగా పంపిణీ చేసింది. ఇలా..అనేక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ దేశ ప్రజలకు వైరస్ సోకకుండా వ్యవహరించింది. సో..ముందుచూపు బాగానే పని చేసిందన్నమాట. 

Also Read | మేము సైతం : అత్యవసర సేవలకు మా విమానాలు వాడుకోండి