Move to Mars : మార్స్‌పై కాలు పెట్టడానికి రెడీనా..? ఇళ్లు కట్టేస్తామంటున్న కంపెనీలు!

అంగారకుడిపై మనిషి తన పాదం మోపాలన్న కోరిక.. నివాసం ఏర్పరచుకోవాలన్న ఆశ.. ఆలోచన ఇప్పటిది కాదు... కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Move to Mars : మార్స్‌పై కాలు పెట్టడానికి రెడీనా..? ఇళ్లు కట్టేస్తామంటున్న కంపెనీలు!

Humans Can Move To Mars Companies May Construct Houses Soon

Move to Mars Houses : అంగారకుడిపై మనిషి తన పాదం మోపాలన్న కోరిక.. నివాసం ఏర్పరచుకోవాలన్న ఆశ.. ఆలోచన ఇప్పటిది కాదు… కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాలు ఈ అరుణగ్రహంపై జెండా పాతాలని ఎప్పటి నుంచో కలలుగంటున్నాయి.. ఆ కలలను నెరవేర్చుకునేందుకు అనేక ప్రయోగాలు చేపట్టాయి.. ఇప్పుడు అరుణ గ్రహంపై ఓ సిటీని నిర్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది ఓ కంపెనీకి.. వెంటనే దానిని ఆచరణలో పెట్టేసి.. మన కళ్ల ముందు ఆ సిటీని ఉంచేసింది. భూమ్మీద కాకుండా ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్నది మనిషి కల.. అటు చంద్రునిపైనో లేక అంగారక గ్రహంపైనో మనుషులు నివసించడానికి వీలుగా కాలనీలు ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.

ఈ సోలార్‌ సిస్టమ్‌లో అన్నింటికంటే ఎక్కువగా భూమిని పోలి ఉన్న మార్స్‌.. అందుకే సైంటిస్టులంతా మార్స్‌పైనే ఫోకస్‌ చేస్తూ అనేక ప్రయోగాలు చేపట్టారు.. ఈ ప్రయోగాల్లో మార్స్‌పై మనిషి మనుగడ సాధ్యమే.. అని రుజువు కావడంతో ఇప్పుడు ఏకంగా కాలనీలు నిర్మించడంపై కూడా దృష్టి సారించారు.. పర్ సపోజ్‌.. మార్స్‌పై ఓ సిటీని ఇలా నిర్మిస్తే బాగుంటుంది అంటూ అబిబో అనే ఆర్కిటెక్ట్‌ సంస్థ నువా పేరుతో కొన్ని డిజైన్లను విడుదల చేసింది.. ఇప్పుడీ డిజైన్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు జరిగిన పరిశోధనలకు సంబంధించిన డేటాను అనలైజ్‌ చేసి ఈ డిజైన్లను రూపొందించి అబిబో.. అంగారకుడిపై థార్సిస్‌ ప్రాంతంలో టెంపే మెన్సా శిఖరానికి ఒక వైపున గుహల్లాంటి నిర్మాణాలతో ఈ నువాను నిర్మిస్తారు.. ఇందులో మొత్తం 2.5 లక్షల మంది వరకు నివసించేలా ఏర్పాట్లు ఉండనున్నాయి.

ఒక్కో ఇల్లు 25 నుంచి 35 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మార్స్‌పై రేడియో ధార్మికత ఎక్కువగా ఉంటుందని ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో తేలింది. అయితే నువాలో దీని నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఈ సిటీని నిర్మించడానికి టెంపే మెన్సా ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక కూడా ఓ కారణముందని అబిబో తెలిపింది.. ఈ శిఖరానికి ఒకవైపు తక్కువ రేడియో ధార్మికత ఉంటుందని… అంతేగాకుండా ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలిన వ్యర్థాలను.. రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తామని ప్రకటించింది. మార్స్‌పై ఉన్న వాతావరణం పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి.. బతికేందుకు అవసరమైన ఆహారం, నీరు, గాలి వంటివన్నీ నువాలోనే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉండనున్నాయి నువాలో..ఇక ఈ శిఖరం దిగువ భాగంలో ప్రజలంతా కలుసుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి.

ట్రాన్స్‌పరెంట్ మెటిరియల్‌తో గోడలను రూపొందించడంతో అంగారకుడి అందాలను నేరుగా వీక్షించవచ్చు అంటోంది అబిబో.. కేవలం ఏదో బతికేస్తున్నామా.. అంటే బతికుతున్నాం అన్నట్టుగా గాకుండా.. హస్పిటల్స్‌, స్కూల్స్‌, స్పోర్ట్స్‌ సెంటర్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, షాపింగ్‌కు తగిన ఏర్పాట్లు కూడా నువాలో ఉన్నాయి.. చివరగా భూమిపై నుంచి మార్స్‌కు.. అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు అవసరమయ్యే స్పేస్‌ స్టేషన్‌, మార్స్‌పై అటు ఇటూ చక్కర్లు కొట్టేందుకు ఒక రైల్వే స్టేషన్‌ కూడా ఉండేలా నువాను డిజైన్‌ చేసింది అబిబో… అబిబో ఇంత హడావుడిగా ఈ డిజైన్లను రూపొందించడానికి కారణం ఎలన్‌ మస్క్‌.. 2050 వరకు మార్స్‌పై కాలనీ కట్టేస్తామని మస్క్‌ చేసిన ప్రకటనతో.. అబిబో ఏకంగా డిజైన్లను సిద్ధం చేసింది.. అటు వివిధ దేశాలు చేస్తున్న ప్రయోగాలు ఒక కొలిక్కి రావడం.. ఇటు ఎలన్‌ మస్క్‌ డిజైన్లను ఒకే చేయడమే లేటు.. మార్స్‌పై నువా సిటీ రూపొందడానికి సిద్దంగా ఉంది..