COVID : ఒబామాకు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ట్వీట్

గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాను... తన సతీమణి మిచెల్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందన్నారు. అనారోగ్య సమస్యలు ఉండడంతో చెక్ చేయించుకున్నట్లు.

COVID : ఒబామాకు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ట్వీట్

Obama

I Just Tested Positive For COVID Barack Obama : అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా కరోనా వైరస్ బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు, గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాను… తన సతీమణి మిచెల్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందన్నారు. అనారోగ్య సమస్యలు ఉండడంతో చెక్ చేయించుకున్నట్లు.. వచ్చిన పరీక్షల్లో మిచెల్ కు నెగటివ్ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ పై ఆయన స్పందించారు. వ్యాక్సిన్ ఇప్పటి వరకు తీసుకోని వారుంటే వెంటనే తీసుకోవాలని సూచించారు.

Read More : US Embassy : ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి

ఇక కరోనా విషయానికి వస్తే… ప్రపంచ వ్యాప్తంగా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు గణనీయంగా తగ్గుతున్నాయి. పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంక్రమంగా కోలుకుంటున్నాయి. అయితే.. చైనాలో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. మరలా అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదవతున్నాయి. గరిష్ట సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ కఠిన నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తోంది.

Read More : Ukraine Russia War: అమెరికా ఉక్రెయిన్‌లో ప్లేగు, ఆంత్రాక్స్ బయో ల్యాబ్ లను నడుపుతోంది: రష్యా

రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్‌చున్‌లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్‌చున్‌లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్‌ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.