Salman Rushdie: సల్మాన్ ఇంకా బతికే ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది: హత్యాయత్నం నిందితుడు

సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు అతడిపై హత్యాయత్నం చేసిన హదీ మటార్. ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా హదీ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.

Salman Rushdie: సల్మాన్ ఇంకా బతికే ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది: హత్యాయత్నం నిందితుడు

Salman Rushdie: తన దాడి నుంచి రచయిత సల్మాన్ రష్దీ కోలుకుంటూ, ఇంకా బతికే ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉందన్నాడు హదీ మటార్. ఈ నెల 12న సల్మాన్ రష్దీపై హదీ మటార్ హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంటే, హదీ జైలులో విచారణ ఎదుర్కొంటున్నాడు.

Tamil Nadu: భర్తపై అనుమానంతో.. మర్మాంగాలపై వేడి నీళ్లు పోసిన భార్య

ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా.. జైలులో ఉన్న హదీ మటార్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. ‘‘రష్దీ అంటే నాకు ఇష్టం లేదు. ఆయన మంచి వ్యక్తి అని అనుకోవడం లేదు. ఆయన ఇస్లాంపై దాడి చేశాడు. ఇస్లాం నమ్మకాలు, ఇస్లాం వ్యవస్థపైనే దాడి చేశాడు’’ అని హదీ చెప్పాడు. కాగా, సల్మాన్ రష్దీని చంపేందుకు ఫత్వా జారీ చేసిన అయతొల్లా కొమీని అంటే తనకు ఇష్టమని చెప్పాడు. అయతొల్లా చాలా మంచి వ్యక్తి అని, అతడిని గౌరవిస్తానని వెల్లడించాడు. అయతొల్లా 1989లో మరణించాడు. అయితే, ఇరాన్ ఉగ్రవాద సంస్థలతో తనకేం సంబంధం లేదన్నాడు.

Hyderabad: హైదరాబాద్‌లో సినిమాకు వెళ్లిన స్కూల్ విద్యార్థులకు ప్రమాదం.. ఎస్కలేటర్ స్పీడ్‌గా వెళ్లడంతో..

తాను ఎక్కువ సమయం ఇంటి బేస్‌మెంట్‌లో వీడియో గేమ్స్ ఆడుకుంటూ గడిపేవాడ్నని, రష్దీ రాసిన ‘ద శాటానిక్ వెర్సస్’ పుస్తకంలోని రెండు పేజీలు చదివానని వెల్లడించాడు. హదీ.. రష్దీపై దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. ప్రస్తుతం రష్దీ కోలుకుంటున్నాడు. ప్రధానంగా ఆయన కాలేయం, కంటికి గాయాలయ్యాయి. హదీ మటార్ అమెరికాలో పుట్టినప్పటికీ, లెబనాన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు.