ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి

ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను వణికించేసింది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 03:52 AM IST
ఆఫ్రికా దేశాల్లో ‘ఇడాయ్’ తుఫాన్…140 మంది మృతి

ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను వణికించేసింది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి.

ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను వణికించేసింది. మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి. మూడు దేశాల్లో సుమారు 140 మంది మృత్యువాత పడ్డారు. వందల మంది గల్లంతయ్యారు. 15 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజాంబిక్‌లోని పోర్ట్ సిటీ బైరా దారుణంగా దెబ్బ తిన్నది. బైరా విమానాశ్రయాన్ని మూసేశారు.

జింబాబ్వేలో ‘ఇడాయ్’ ప్రభావం
జింబాబ్వేలో ఇడాయ్ తుఫాన్ ప్రభావానికి 65 మంది మృతి చెందారని స్థానిక ప్రజాప్రతినిథి జోషూ సక్కో తెలిపారు. ముఖ్యంగా  దేశంలోని తూర్పు జిల్లా చిమనీమణి అనే గ్రామంలో వరదనీరు విపరీతంగా పోటెత్తడంతో గ్రామస్థులు పలువురు కొట్టుకుపోయారని వారి ఆచూకి ఇంతవరకూ తెలియరాలేదని తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్ మంగాగ్వా తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని తుఫాన్ సహాయపనులను పర్యవేక్షించేందుకు స్వదేశానికి తిరిగివచ్చారు. 
Read Also : మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు  జింబాబ్వేలోని న్యాహోదీ నది పొంగి ప్రవహిస్తోంది. పలు వంతెనలు దెబ్బతినడంతో సహాయ పునరావాస పనులకు విఘాతం వాటిల్లుతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో జింబాబ్వే మిలటరీ అధికారులు రంగంలోకి దిగి సహాయ పునరావాస చర్యల్ని ముమ్మరం చేశారు. దీంతో ప్రభుత్వ గృహాలు కూడా నీటమునిగిపోయాయి. పంటలు నీట మునిగి అపార నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.  

మొజాంబిక్‌లోని పోర్ట్ సిటీ బైరా సిటీ మీదుగా మొజాంబిక్ తూర్పు దిక్కున గల జింబాబ్వే, మలావీ వైపు తుఫాన్ దూసుకెళ్లింది. ఫలితంగా ఆ రెండు దేశాల్లో ఇండ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు , ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బ తిన్నాయి. పలు చోట్ల ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొండలు, పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. సహాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. మూడు దేశాల ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితి..రెడ్‌క్రాస్ సంస్థలు ముందుకు వచ్చాయి.

పొరుగున ఉన్న ఇతర ఆఫ్రికా దేశాల నుంచి హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలు, తాగునీరు, ఔషధాలను తరలిస్తున్నాయి. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నదని మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిపే న్యూసి ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల మలావీ, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో వంద మందికి పైగా మరణించారని 8,50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది.