Taslima Nasreen : ‘మహ్మద్ ప్రవక్త జీవించి ఉంటే’..అంటూ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి. భారత్ లో హైద‌రాబాద్ స‌హా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌నలకు దిగారు ముస్లింలు. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Taslima Nasreen : ‘మహ్మద్ ప్రవక్త జీవించి ఉంటే’..అంటూ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

Author Taslima Nasreen As Protests Flare

author Taslima Nasreen : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత్ కు తలనొప్పిగా మారాయి.బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలో ఏకంగా భారతీయ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడే స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15దేశాలు భారత్‌పై మండిపడుతున్నాయి. ఈ ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడే అవకాశాలున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read : GULF Contries serious on India :బీజేపీ నేతల వ్యాఖ్యలతో ప్రమాదంలో భారత ఆర్ధిక వ్యవస్థ..ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు

బీజేపీ నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్ సహా బంగ్లాదేశ్‌లో భారీ ఆందోళనలు చెలరేగాయి. భారత్ లో హైద‌రాబాద్ స‌హా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌నలకు దిగారు ముస్లింలు. ముస్లిం దేశాల‌న్నీ భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. భారత ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని నినదించారు. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త బతికి ఉంటే ఈ పిచ్చిని చూసి షాకై ఉండేవారంటూ వ్యాఖ్యానించారు.

Also read : prophet row: ముస్లిం దేశాల‌న్నీ భార‌తీయ‌ ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలంటూ బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌లు

ఈ ఆందోళనలను ఖండించిన తస్లీమా.. మహ్మద్ ప్రవక్త కనుక ఇప్పుడు బతికి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మతోన్మాద పిచ్చిని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురై ఉండేవారంటూ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిన్న ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని, ఉరితీయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తస్లీమా ఈ వ్యాఖ్యలు చేయటం గమనించాల్సిన విషయం. కాగా బీజేపీ నేతలు నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్‌ను అరెస్టు చేయాల్సిందే అంటూ హైదరాబాద్ లోని పాత‌బ‌స్తీలో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి.