Pakistan: ర్యాలీలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‭ వీడియో చూపిస్తూ భారత్‭పై పొగడ్తలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్

సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్‭ను ‘రష్యా ఆయిల్ కొనడం ద్వారా యుద్ధానికి సహాయ పడుతున్నట్టే కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. నాకు ఆర్గుమెంట్ చేయడం ఇష్టం లేదు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటే యుద్ధానికి సహకరించినట్లైతే, అదే రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొంటుంది. మరి యూరప్ ఎందుకు యుద్ధానికి సహకరించినట్లు కాదు? కేవలం భారత రూపాయి మాత్రమే యుద్ధానికి వెళ్తుందా? లేదంటే భారత్ కొంటేనే యుద్ధానికి సహకరించినట్టా? కొంచెం సమదృష్టితో నడుచుకుందాం’’ అని అని జయశంకర్ అన్నారు.

Pakistan: ర్యాలీలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‭ వీడియో చూపిస్తూ భారత్‭పై పొగడ్తలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్

Imran khan plays jaishankar video in rally then praises india

Pakistan: కొంత కాలంగా భారత విదేశాంగ పాలసీ గురించి సానుకూలంగా మాట్లాడుతూ వస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్.. తాజాగా నిర్వహించిన ఒక పబ్లిక్ మీటింగులో భారత విదేశాంగ పాలసీపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పబ్లిక్ ర్యాలీలో ప్లే చేసి భారత విధానాలపై పొగడ్తలు కురిపించారు. నిజానికి పాక్, భారత్ మధ్య పచ్చగడ్డిలో నీళ్లు పోసినా నిప్పే రగులుతుంది. విధానాలు ఎలాంటివైనా ఇరు దేశాల నేతలు విమర్శలు గుప్పించుకుంటారు. కానీ మొదటి నుంచి ఇమ్రాన్ వైఖరి ఇందుకు కాస్త భిన్నంగానే కనిపిస్తూ వస్తోంది. ఆ మధ్య నరేంద్ర మోదీయే మళ్లీ ప్రధాని కావాలని ఇమ్రాన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అనంతరం తన పదవికి గండి పడిందన్న సమయం నుంచి భారత విదేశాంగ పాలసీని ఆకాశానికి ఎత్తుతుండడం గమనించవచ్చు.

విషయం ఏంటంటే.. తాజాగా లాహోర్‭లో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాక్‭లోని షెహ్బాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా ఒత్తిడి తీసుకువస్తే భారత్ ఎదిరించి తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా ఆయిల్ కొంటామని చెప్పిందని, అయితే పాక్ మాత్రం అమెరికాకు భయపడి రష్యా ఆయిల్ కొనకుండా ఖరీదైన ఆయిల్ కొంటూ దేశ ఖజానాను మరింత నష్టాల్లోకి నెడుతోందని ఇమ్రాన్ విమర్శించారు.

‘‘రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని భారత్‭పై అమెరికా ఒత్తిడి తెచ్చింది. మీరెవరని జయశంకర్ ప్రశ్నించారు. రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొంటుంది, మరి మేం ఆయిల్ కొంటే తప్పేంటని జయశంకర్ సూటిగా సమాధానం చెప్పారు. ఇది ఒక దేశం యొక్క స్వతంత్రత. కానీ పాకిస్తాన్ ఇలా చేయలేదు. అమెరికా బెదిరింపులకు లొంగి తక్కువ ధరకు దొరికే రష్యా ఆయిల్ కొనడం ఆపేసింది’’ అని ఇమ్రాన్ అన్నారు. దీనికి ముందు స్లోవేకియాలో జరిగిన గ్లోబ్‭సెక్ 2022 బ్లతిస్లావ ఫోరం సదస్సుకు సంబంధించిన వీడియోను ర్యాలీలో ఇమ్రాన్ ప్లే చేశారు.

ఆ వీడియో ప్రకారం.. సమావేశంలో కేంద్ర మంత్రి జయశంకర్‭ను ‘రష్యా ఆయిల్ కొనడం ద్వారా యుద్ధానికి సహాయ పడుతున్నట్టే కదా?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. నాకు ఆర్గుమెంట్ చేయడం ఇష్టం లేదు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటే యుద్ధానికి సహకరించినట్లైతే, అదే రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొంటుంది. మరి యూరప్ ఎందుకు యుద్ధానికి సహకరించినట్లు కాదు? కేవలం భారత రూపాయి మాత్రమే యుద్ధానికి వెళ్తుందా? లేదంటే భారత్ కొంటేనే యుద్ధానికి సహకరించినట్టా? కొంచెం సమదృష్టితో నడుచుకుందాం’’ అని అని జయశంకర్ అన్నారు.

ఈ వీడియా ప్లే చేసిన అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ.. రెండు దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చిందని, అయితే భారత్ తన సార్వభౌమత్వాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతే పాకిస్తాన్ మాత్రం దిగజార్చుకుంటూ వస్తోందని అన్నారు. భారత్ అన్ని రంగాల్లో ముందుకు పోతుంటే పాక్ అన్ని రంగాల్లో వెనక్కి వెళ్తుందని అన్నారు. పాకిస్తాన్‭కు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ స్వతంత్రత లేదని, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ అన్నారు.

Tiranga Yatra in Kashmir: కశ్మీర్ చరిత్రలో పాక్ జెండాలు: లెఫ్ట్‭నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా