Humans meet Aliens: మరికొన్నేళ్లల్లో మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు: నాసా మాజీ శాస్త్రవేత్త

అయితే, శాస్త్రవేత్తలే కాదు..త్వరలో సాధారణ మనుషులు కూడా గ్రహాంతర జీవులను కలుసుకుంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు

Humans meet Aliens: మరికొన్నేళ్లల్లో మనుషులు ఏలియన్స్‌ని కలుసుకుంటారు: నాసా మాజీ శాస్త్రవేత్త

Nasa

Humans meet Aliens: అంతరిక్ష పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. ఏళ్లకేళ్లుగా సాగుతున్న గమ్యంలేని పరిశోధనలు విశ్వంపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహం గురించి, మనుషుల్లాంటి జీవుల గురించి శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. విశ్వంలోని ఇతర గ్రహాల్లో ఎక్కడోచోట..ఏదో ఒక జీవి ఉండే ఉంటుందన్న ఉత్సుకతతో గ్రహాంతర జీవాన్వేషణలో నిమగ్నమై ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే, శాస్త్రవేత్తలే కాదు..త్వరలో సాధారణ మనుషులు కూడా గ్రహాంతర జీవులను కలుసుకుంటారని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాజీ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. మరి కొన్నేళ్లలోనే మనుషులు, గ్రహాంతర వాసులను కలుసుకుంటారని నాసా మాజీ శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ వెల్లడించారు. బీబీసీ నిర్వహించే ‘హార్డ్ టాక్’ కార్యక్రమంలో ఇటీవల మాట్లాడిన జిమ్ గ్రీన్ భూమికి ఆవల జీవం ఉందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

Read Others:Gyanvapi Survey Row: జ్ఞానవాపి మసీదు సర్వేపై తీర్పులో ‘స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం’ చేసిన న్యాయమూర్తి

అతి త్వరలోనే మానవులు “నిజంగా ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ”కు దగ్గరలోనే ఉన్నారని గ్రీన్ చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల పాటు నాసాలో పనిచేసిన జిమ్ గ్రీన్..తన జీవిత కాలంలోనే ఏలియన్స్ ను చూస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య కిరణాలు తాకేంత దూరంలో అనేక గ్రహాలు ఉన్నాయని, వాటిలో భూమిలాంటి గ్రహాలు కూడా ఉండి..తాగేందుకు నీరు కూడా ఉంటుందని జిమ్ పేర్కొన్నారు. గ్రహాలు, వాటిపై ఉన్న వాతావరణ పరిస్థితులను గమనించనేదుకు..ఇటీవల శక్తివంతమైన ‘జేమ్స్ వెబ్” టెలీస్కోప్ ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ఈ టెలీస్కోప్ ద్వారా గ్రహాలపై నీటి జాడలను కనిపెట్టడం తేలిక అవుతుందని..చాలా వరకు గ్రహాల్లో నీరు ఉంటే..జీవం కూడా ఉండే అవకాశం ఉందని జిమ్ గ్రీన్ పేర్కొన్నారు.

Read others:Karnataka: కర్ణాటకలో మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్

జేమ్స్ వెబ్ టెలీస్కోప్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే..భూమికి సుదూర ప్రాంతాల్లోని గ్రహాల ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను పసిగట్టి వాటిని ఇతర గ్రహాల పరిసితులతో అంచనా వేయడం ద్వారా ఊహకు అందని విషయాలు వెలుగులోకి వస్తాయని జిమ్ గ్రీన్ వెల్లడించారు. ఏదేమైనా భూమికి ఆవల మరో జీవాన్ని కనిపెట్టడం అతి త్వరలోనే సాక్షత్కారం కానుందని నాసా మాజీ శాస్త్రవేత్త జిమ్ గ్రెయిన్ వెల్లడించారు.