Karnataka: కర్ణాటకలో మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్

రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్‌లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది.

Karnataka: కర్ణాటకలో మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్

Karnataka Assembly

Karnataka: రాష్ట్రంలో మత మార్పిడులను నిరోధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును గత డిసెంబర్‌లోనే కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. ‘కర్ణాటక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్-2021’ పేరుతో ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మాత్రం ఈ బిల్లు ఇంకా ప్రవేశపెట్టలేదు. కౌన్సిల్‌లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా అనే సందేహం ఉంది. ఎందుకంటే కౌన్సిల్‌లో మొత్తం 75 సీట్లుంటే ప్రతి పక్ష కాంగ్రెస్, జేడీయూకు కలిపి 41 సీట్లు ఉన్నాయి.

Basavaraj Bommai : బసవరాజు బొమ్మై డబ్బులిచ్చి సీఎం అయ్యారు : మాజీ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు

అధికార బీజేపీకి 32 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టం రూపొందించాలని కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో గురువారం సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ తెచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ వద్దకు వెళ్తుంది. కాగా, గవర్నర్ ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని కర్ణాటకకు చెందిన పలువురు మత బోధకులు కోరుతున్నారు. బెంగళూరు ఆర్చిబిషప్, ఈ బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌ను కోరారు. ఈ బిల్లు ప్రధానంగా రెండు అంశాల ఆధారంగా రూపొందించారు. బలవంతపు మత మార్పిడులను నిరోధించడంతోపాటు, సరైన ఆమోదం లేని, అనధికార మతాంతర వివాహాలను నిరోధించే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందింది.