Sirisha Bandla: చారిత్రాత్మకం.. నేడు తెలుగమ్మాయి అంతరిక్ష యాత్ర!

అంతరిక్షంలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు.

Sirisha Bandla: చారిత్రాత్మకం.. నేడు తెలుగమ్మాయి అంతరిక్ష యాత్ర!

Sirisha Bandla

Sirisha Bandla: అంతరిక్షంలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసియానం చేయనున్న భారత సంతతి మహిళగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ షిప్‌లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్‌ బ్రాన్సన్‌తో మరియు 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు.

వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నేడే రోదసీలోకి వెళ్లనున్న శిరీష.. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవ కారణమని ట్వీట్‌ చేశారు. షిప్‌లో ఆమె రిసెర్చర్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాధ్యతలు చేపట్టనుంది. తనకు ఈ అవకాశం దక్కినట్లు తెలియగానే మాటలు రాలేదంటూ వర్జిన్‌ గెలాక్టిక్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్టు చేశారు. అమెరికాలోని ప్యూర్‌డ్యూ యూనివర్సిటీలో ఆమె విద్యాభ్యాసం చేసిన శిరీష్ రోదసియానం సందర్భంగా తాను చదివిన యూనివర్సిటీని గుర్తు చేసుకున్నారు.

ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15వేల మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లనుండగా.. అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళుతుంది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ యాత్ర విజయవంతమైతే భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కనున్నారు.

ఇక, ఈ యాత్రలో అందరూ సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత వర్జిన్‌ గెలాక్టిక్‌ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు బెత్‌ మోసెస్‌ది కాగా వ్యోమనౌకలోని క్యాబిన్‌ పనితీరును పరిశీలించి, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ఆధునికీకరణలను గుర్తించే బాధ్యత ముఖ్య ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెనెట్‌ది. వీరితోపాటు ఈ యాత్రలో ముఖ్య పైలట్‌ డేవ్‌ మెక్‌కే, పైలట్‌ మైఖేల్‌ మాసుకీ పాలుపంచుకోనున్నారు. న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి నేడు మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగనుంది.