Indian Embassy: ఇండియన్ ఎంబస్సీ తరలింపు.. ఫోకస్ మార్చిన రష్యా

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం.. 'యుక్రెయిన్ లో నెలకొన్ని సెక్యూరి టీ ఇబ్బందుల రీత్యా, దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పరిగణనలోకి...

Indian Embassy: ఇండియన్ ఎంబస్సీ తరలింపు.. ఫోకస్ మార్చిన రష్యా

Indian Embassy (1)

Indian Embassy: విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన స్టేట్మెంట్ ప్రకారం.. ‘యుక్రెయిన్ లో నెలకొన్ని సెక్యూరి టీ ఇబ్బందుల రీత్యా, దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పరిగణనలోకి తీసుకుంటూ ఎంబస్సీని మార్చాలనుకుంటున్నాం. పోలాండ్ కు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ యుక్రెయిన్ కు వచ్చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

యుక్రెయిన్‌ యుద్ధంలో రష్యా వ్యూహం మార్చింది. పశ్చిమ యుక్రెయిన్‌పై దృష్టి సారించింది. ఇప్పుడీ ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేశాయి రష్యన్‌ బలగాలు. లీవ్‌లో మిలటరీ ట్రైనింగ్‌ సెంటర్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. లీవ్‌లోని యుక్రెయిన్‌ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్‌ ఫైటర్‌ జెట్లు దాడులు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు మిలటరీ ట్రైనింగ్‌ బేస్‌పై ఎనిమిది మిసైల్‌ దాడులు జరిగాయి. రష్యా ఉన్నట్టుండి పశ్చిమ యుక్రెయిన్‌పై దాడి చేయడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నాటో నుంచి యుక్రెయిన్‌ ఆర్మీకి అందుతున్న సాయం పొలండ్‌ మీదుగా లీవ్‌కే వస్తుందని రష్యా భావిస్తోంది. ఇక్కడి నుంచే యుక్రెయిన్‌ ఆర్మీకి ఆయధాలు సరఫరా అవతున్నాయన్న అనుమానాలు కూడా రష్యాకు ఉన్నాయి.

Read Also : శరణార్థుల కాన్వాయ్‌ పై రష్యా కాల్పులు..చిన్నారితో సహా ఏడుగురు మృతి

ఇప్పుడు ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టి ముందుగా లీవ్‌లోని ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థను ధ్వంసం చేసి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాడులు చేయాలన్న ఆలోచనలో రష్యన్‌ ఆర్మీ ఉంది.