Sri Lanka: శ్రీలంకకు సాయంగా 50 ఫ్యూయెల్ స్టేషన్లు ఓపెన్ చేయనున్న ఇండియన్ ఆయిల్

ఇండియాకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (LIOC) శ్రీలంకలో 50 కొత్త ఫ్యూయెల్ స్టేషన్లు ఓపెన్ చేసేందుకు ఆ దేశం అనుమతులిచ్చింది. ఇందన సంక్షోభంతో సతమతమవుతున్న దేశానికి సాయం చేసేందుకే ఈ ప్రయత్నం చేసింది.

Sri Lanka: శ్రీలంకకు సాయంగా 50 ఫ్యూయెల్ స్టేషన్లు ఓపెన్ చేయనున్న ఇండియన్ ఆయిల్

 

Sri Lanka: ఇండియాకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (LIOC) శ్రీలంకలో 50 కొత్త ఫ్యూయెల్ స్టేషన్లు ఓపెన్ చేసేందుకు ఆ దేశం అనుమతులిచ్చింది. ఇందన సంక్షోభంతో సతమతమవుతున్న దేశానికి సాయం చేసేందుకే ఈ ప్రయత్నం చేసింది.

విదేశీ మారక ద్రవ్యం కొరత కారణంగా ఆహారం, ఔషధం, ఇంధనం వంటి ముఖ్యమైన దిగుమతుల కోసం చెల్లించడానికే శ్రీలంక నానా తంటాలు పడుతుంది. 70 సంవత్సరాల ఆర్థిక సంక్షోభం లంకను అతలాకుతలం చేసింది.

LIOC ఇప్పటికే లంకలో 216 ఇంధన స్టేషన్లను కలిగి ఉంది. సుమారు 2 బిలియన్ రూపాయలు ($5.5 మిలియన్లు) పెట్టుబడి వెచ్చించి పరిశ్రమ మొదలుపెట్టనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా మీడియాకు వివరించారు.

Read Also : భారత్‌ పై చైనా మరో భారీ కుట్ర..చైనా నుంచి శ్రీలంకకు నిఘా నౌక

“ఈ అప్రూవల్ పొందడానికి కొంతకాలం ముందు నుంచే ప్రయత్నిస్తున్నాం. శ్రీలంక సవాళ్లను పరిష్కరించడానికి దానితో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చి పెద్ద పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం” అని గుప్తా తెలిపారు.

దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్, ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (CPC), సుమారు 1,190 ఇంధన స్టేషన్లను నిర్వహిస్తోంది.