భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీల ప్రమాణస్వీకారం

  • Published By: venkaiahnaidu ,Published On : December 18, 2019 / 03:34 PM IST
భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీల ప్రమాణస్వీకారం

ఇటీవల బ్రిటన్ లో జరిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్(పార్లమెంట్)లో ప్రమాణ స్వీకారం చేశారు. గత గురువారం జరిగిన ఎన్నికల్లో 15 మంది భారత సంతతి నేతలు ఎంపీలుగా గెలిచారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి భారీ ఆధిక్యత లభించిన విషయం తెలిసిందే.

అయితే వీరిలో భారత సంతతి ఎంపీలు అలోక్ శర్మ, రుషి సునక్ లు భగవద్గీతపై ప్రమాణం చేశారు. భగవద్గీతను చేతిలో ఉంచుకుని, నిబంధనల ప్రకారం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో చెప్పవలసిన మాటలను పలికారు. బ్రిటన్ రాణికి విధేయంగా ఉంటామని వారు తెలిపారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ బైబిల్‌పై ప్రమాణం చేశారు. 

అలోక్ శర్మ (52) ఆగ్రాలో జన్మించారు. రీడింగ వెస్ట్ నుంచి ఆయన నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రుషి సునక్ (39) రిచ్‌మండ్, యార్క్‌షైర్ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తికి రుషి అల్లుడన్న విషయం తెలిసిందే.