Ukraine-Russia War: మోదీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిసేలా చేయగలరు: ఫ్రెంచ్ జర్నలిస్ట్ లారా హైమ్

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతోంది. ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ముగిసేలా చేయగలరని ప్రముఖ ఫ్రెంచ్ జర్నలిస్ట్ లారా హైమ్ అన్నారు.

Ukraine-Russia War: మోదీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగిసేలా చేయగలరు: ఫ్రెంచ్ జర్నలిస్ట్ లారా హైమ్

russia ukraine tortured prisoners of war says un Human rights office

Ukraine-Russia War: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడుతోంది. ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా ఎవరికీ తెలియదు. అయితే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ముగిసేలా చేయగలరని ప్రముఖ ఫ్రెంచ్ జర్నలిస్ట్ లారా హైమ్ అన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాలపై లారా హైమ్ కు అపార అనుభవం ఉంది. యుద్ధం ముగిసేలా రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగేందుకు చొరవ చూపే నాయకుడు కావాలని, ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరిగే విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించగలరని ఆమె చెప్పారు.

అయితే, ప్రస్తుత సమయంలో చర్చలు జరగడం క్లిష్టతరమని, చర్చలు జరగాలని ఉక్రెయిన్ కోరుకోవడం లేదని, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరు ఎలా ఉందో అంతర్జాతీయ న్యాయస్థాం ద్వారా స్పష్టం కావాలనుకుంటోందని అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై అమెరికాలోని ప్రముఖులు మాట్లాడకపోతుండడం ఆశ్చర్యం కలిగించే విషమని చెప్పారు. ఉక్రెయిన్ లో జరుగుతోన్న యుద్ధం సుదీర్ఘకాలం జరుగుతుందని అన్నారు.

ఉక్రెయిన్ లో చివరకు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని చెప్పారు. రష్యా మరిన్ని భీకరదాడులు చేయొచ్చని అన్నారు. ఉక్రెయిన్ పౌరులు చాలా ధైర్యవంతులని చెప్పారు. పశ్చిమ దేశాల సాయం కోరుతూ రష్యాతో పోరాడుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు ఆయుధాలు కావాలని చెప్పారు. అమెరికా మరింత సాయం చేయనుందని తెలిపారు.

Surya Narayana : ప్రముఖ సీనియర్ నిర్మాత మృతి.. ఎన్టీఆర్ కి ‘అడవి రాముడు’ హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..