కరెన్సీ కాదు..కొబ్బరిబోండాలే కాలేజీ ఫీజులు..వస్తు మార్పిడి మళ్లీ వచ్చిందా?

  • Published By: nagamani ,Published On : November 4, 2020 / 11:21 AM IST
కరెన్సీ కాదు..కొబ్బరిబోండాలే కాలేజీ ఫీజులు..వస్తు మార్పిడి మళ్లీ వచ్చిందా?

Indonesian college Coconuts fees : పూర్వకాలంలో వస్తు మార్పిడి వ్యాపారం జరిగేది. ఈ కరోనా కాలంలో కాలచక్రం తిరిగి ఆరోజుల్ని తీసుకొచ్చిందా? అనిపిస్తోంది. వస్తుమార్పిడి కాలం మళ్లీ వచ్చిందానిపిస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోయాయి.




ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని దేశాలైతే తీవ్ర ఆహార ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశాల్లో ఇండోనేషియా కూడా ఉంది.అసలే ఆర్థికమాంద్యంతో నానా అవస్థలు పడుతున్న ఇండోనేషయా కరోనా మహమ్మారి దెబ్బకు మరింతగా కుదేలైపోయింది. పర్యాటక రంగంపై ఆధారపడిన బాలి వంటి ద్వీపాలు ఈ పరిస్థితిని అగమ్యగోచరంగా మారాయి. ఆర్థిక కష్టాల్ని తట్టుకోలేకపోయాయి.



ఈ ప్రభావం అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలమీద కూడా పడింది. ఆర్థిక కష్టాలతో ఇండోనేషియా విద్యార్ధులు కాలేజీలకు ఫీజుల కట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో అక్కడి  స్కూల్స్, కాలేజీలు ‘‘ఫీజులు డబ్బులకు బదులు కొబ్బరికాయల్ని’’ తీసుకుంటున్నారు.



https://10tv.in/indias-1-day-covid-cases-below-50000-for-first-time-in-nearly-3-months/
నగదుకు బదులుగా కొబ్బరికాయలనే ఫీజులుగా తీసుకోవాలని బాలిలోని కాలేజీలు నిర్ణయించాయి. అనేక ద్వీపాల సమాహారం అయిన ఇండోనేషియాలో కొబ్బరిచెట్లు విపరీతంగా ఉంటాయి. కొబ్బరి చెట్లపై వచ్చే ఆదాయం ఇండోనేషియా ఆర్థికరంగంలో ఎక్కువశాతమే ఉంటుంది. అందుకే కొబ్బరికాయలతో పాటు, ఇతర సహజ ఉత్పత్తులను ఫీజు రూపంలో చెల్లించవచ్చని విద్యార్ధులకు సూచించాయి.



దీంతో ఆర్థిక కష్టాల వల్ల ఫీజులు కట్టలేక కాలేజీలు మానేద్దామనుకునే విద్యార్ధులకు కాలేజీలు ఇచ్చిన ఈ అవకాశం వరంలా భావించారు. కష్టకాలంలో కాలేజీ యాజమాన్యాలు మానవతా దృక్పథంతో స్పందించడం విద్యార్ధుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.స్కూలు, కాలేజీ యాజమాన్యలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు కూడా అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.