‘ఆ 52 చైనా యాప్స్ ను నిషేధించండి’..ఇంటెలిజెన్స్ వర్గాల సూచన

  • Published By: bheemraj ,Published On : June 18, 2020 / 01:01 AM IST
‘ఆ 52 చైనా యాప్స్ ను నిషేధించండి’..ఇంటెలిజెన్స్ వర్గాల సూచన

చైనాకు సంబంధించిన యాప్స్ వాడితే డేటా చైనాకు తరలిపోతోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని యాప్స్ సంస్థలు అలాంటిదేమీ లేదంటూ చెప్పాయి. తాజాగా అలాంటి సందేహాలున్న 50కి పైగా యాప్ ల జాబితాను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో జూమ్, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, క్లీన్ మాస్టర్ వంటివి ఉన్నాయి. ఆ యాప్స్ ను వాడకుండా నిషేధించాలని కోరుతున్నాయి.

ఇంటెలిజెన్స్ ఎజెన్సీ వర్గాలు చేసిన సిఫారసులకు జాతీయ భద్రతా మండలి మద్దతు ఇచ్చిందని, అవి దేశ భద్రతకు హానికరమని భావిస్తోందని సీనియర్ అధికారి వెల్లడించారు. వీటి విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, ఒక్కో యాప్ ఎంతవరకు ప్రమాదకరమో పరిశీలించాల్సి ఉందన్నారు. చైనాకు చెందిన, ఆ దేశంతో సంబంధమున్న సంస్థలు రూపొందించిన యాప్స్ లో మాల్ వేర్, స్పైవేర్ ఉండొచ్చని భద్రతా నిపుణులు అంటున్నారు. ఇవి వినియోగదారుల భద్రతకు ప్రమాదకరమని అధికారులు అంటున్నారు. 

ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించిన యాప్ ల జాబితా
టిక్ టాక్, వొల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, విచాట్, షేర్ ఇట్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, జెండర్, క్లబ్ ఫ్యాక్టరీ, హలో, లైక్, క్వయ్, రోమ్ వీ, షిఇన్, న్యూస్ డాగ్, ఫొటో వండర్, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షావోమీ, పార్లల్ స్పేస్, వీసింక్, సెల్ఫీసిటీ, క్లాష్ ఆఫ్ కింగ్స్ ఏపీయూఎస్ బ్రౌజర్, వివా వీడియో-క్యూయూ వీడియో, ఇంక్, పర్ ఫెక్ట్ క్రాఫ్, సీఎం బ్రౌజర్, వైరస్ క్లీనర్ (హై సెక్యూరిటీ ల్యాబ్), ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్టర్, యూక్యామ్ మేకప్, ఎంఐ స్టోర్, 360 సెక్యూరిటీ, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ బ్రౌజర్, డీయూ క్లీనర్, డీయూ ప్రైవసీ, క్లీన్ మాస్టర్-చీతా, క్వాచీ క్లియర్ డియూ యాప్స్ స్డూడియో, బైదూ మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్ ఫీడ్.   

Read: చైనా ఉత్పత్తులను భారత్ పూర్తిగా బహిష్కరించలేకపోవచ్చు! ఎందుకో తెలుసా?