ఒక చిన్నదేశంలో మోడల్… ట్రంప్ భార్యగా మెలానియా వైరల్ ఫోటోలు !!

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 07:25 AM IST
ఒక చిన్నదేశంలో మోడల్… ట్రంప్ భార్యగా మెలానియా వైరల్ ఫోటోలు !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యా  మెలానియాతో పాటు ఈరోజు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. మరి మెలానియో ట్రంప్ భార్య కాక ముందు ఏం చేసేవారు? ఆమె ఏ దేశస్తురాలు? అసలు ఆమె ఎవరు? అనే అంశంపై ఎంతో ఆసక్తిగా నెట్ లో వెతికేస్తున్నారు జనాలు.

1

ట్రంప్ భార్య మెలానియో గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.  డొనాల్డ్ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అయిన మెలానియా 1970లో సల్వేనియాలో జన్మించారు.

1

1998లో ఆమె న్యూయార్క్‌లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ పార్టీలో ట్రంప్‌ను కలుసుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ రాజకీయాల్లో లేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అప్పటికే ట్రంప్‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. రెండవ భార్యకు విడాకులు ఇచ్చే వ్యవహారం కొనసాగుతోంది.
 

See Also>>Wow నమస్తే ట్రంప్ : ఆశ్చర్యపోయిన ట్రంప్ సహాయకుడు

3

డొనాల్డ్ ట్రంప్‌కు 52 ఏళ్లు, మెలానియాకు 28 ఏళ్లు. ఓ పార్టీ సందర్భంగా ఇరువురూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. వారం రోజుల తరువాత ఇద్దరి ‘డేటింగ్’స్టార్ట్ అయ్యింది. వారి డేటింగ్ అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. అలా ఐదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నతరువాత 2005లో ట్రంప్ మెలానియా పెళ్లి చేసుకున్నారు.  

2

ఆ సమయంలో ట్రంప్ ఆమెకు 1.5 మిలియన్ డాలర్లు ఖరీదు చేసే డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చారు. 2006 వారికి కుమారుడు జన్మించాడు. కాగా అప్పటికే ట్రంప్‌కు కుమార్తె ఇవాంకా, కొడుకు డొనాల్డ్ జూనియర్ ఉన్నారు.  2016లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయిన నేపధ్యంలో మెలానియా అమెరికా ప్రథమ మహిళ అయ్యారు. అలా మెలానియో అమెరికా అధ్యక్షుడి భార్య అయ్యారు. అప్పటి మెలానియా మోడల్ ఫోటోలు..ట్రంప్ కుటుంబం భారత్ సందర్శన సందర్భంగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

4