International Coffee Day: టేస్టును ఆస్వాదించటమేకాదు..కాఫీ గురించీ తెలుసుకోండి

అక్టోబర్ 1. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఈ సందర్భంగా కాఫీ తాగితే కలిగే ఉపయోగాలేంటీ? అతిగా తాగితే కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

International Coffee Day: టేస్టును ఆస్వాదించటమేకాదు..కాఫీ గురించీ తెలుసుకోండి

International Coffee Day 2021

International Coffee Day 2021: అక్టోబర్‌ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. కాఫీ. వాసన వస్తే చాలు ఓ కప్పు తాగేయాలనిపిస్తుంది.ఉదయం లేవగానే ఓ కప్పు కాఫీ గొంతులో దిగందే ఏ పనీ చేయాలనే ఉత్సాహం రాదు. మనిషి దైనందిన జీవనంలో టీ, కాఫీలు ఒక భాగంగా మారిపోయాయి. అందుకే వీటి కోసమూ ప్రత్యేకంగా రోజులను నిర్వహిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా కాఫీ తాగితే కలిగే ప్రయోజనాల గురించి..అలాగే కాఫీ అతిగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడమే ఈరోజు ప్రత్యేకత. అలాగే కాఫీ వ్యాపారం గురించి చర్చిస్తూ..‘కాఫీ’ని జీవనోపాధిగా చేసుకునే వాళ్లకు మద్దతు ప్రకటించే రోజు కూడా.

కాఫీ అంటే ఇష్టం కదాని రోజుకు ఓ 10కప్పుల కాఫీని కడుపులో పోసేస్తే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు.ఏదైనా అతి మంచిదికాదు కదా. పోషకాహారం కూడా తగినంత మోతాదులోనే తీసుకోవాలని చెబుతుంటారు. మరి అటువంటిది కాఫీ ఎక్కువగా తాగితే కలిగే అనర్ధాలేంటో ఈ కాఫీడే సందర్భంగా తెలుసుకుందాం. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగొచ్చు..తాగితే ఏం ఏం ప్రయోజనాలు ఉంటాయి. అతిగా తాగితే కలిగే నష్టమేంటో తెలుసుకుందాం..

Read more : జూన్ 21 ‘‘సెవెన్ స్పెషల్ డేస్’’…అవేంటంటే..

ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్‌ వంటివి బాడీని చురుకుగా ఉంచుతాయి. ఒక కప్పు కాఫీ తాగగానే బాడీలో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. కాస్త హుషారొస్తుంది. అది ఆయా వ్యక్తుల ఆరోగ్య విధానాలను బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీతో పాటు శరీరంలో కొవ్వుల శాతం కూడా ఎక్కువగా ఉంటే..సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ పొడి తయారు చేసే విధానాన్ని బట్టి..కాఫీ తయారు చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు అది ఫిల్టర్‌ కాఫీనా? సాధారణ కాఫీనా? అనే విషయాలన్నమాట.

2015 నుంచి ఇంటర్నేషనల్‌ కాఫీ ఆర్గనైజేషన్‌ ఇంటర్నేషనల్‌ కాఫీ డే నిర్వహిస్తోంది. కొన్నిదేశాల్లో ఇది వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తున్నప్పటికీ.. ఎక్కువ దేశాలు మాత్రం అక్టోబర్‌ 1నే జరుపుతున్నాయి. ఈ కారణం వల్లే అక్టోబర్‌ 1ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా పాటిస్తున్నారు.

మరి కాఫీలోఉండే సుగుణాల గురించి తెలుసుకుందాం..

కాఫీ మంచి రుచితో పాటు బోలెడన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. కాఫీని పరిమిత మోతాదుల్లో తాగితే పక్షవాతం రాకుండా చేస్తుంది. అంటే స్ట్రోక్‌ వంటివి రాకుండా నివారిస్తుంది.కాఫీలోని డైఫినాల్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ స్ట్రోక్స్ రాకుండా నివారిస్తుంది.కాఫీ తాగితే శరీరంలో ఉత్తేజంగా ఉంటుంది. అలా ఉండాలి అంటే పరిమితంగా మాత్రమే తాగాలని గుర్తుంచుకోవాలి. అంటే రోజుకు కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తాగాలి.

కాఫీలోని కెఫిన్‌తో ఆరోగ్యం..
కాఫీలో ఉండే కెఫిన్‌ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే… దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్‌ బ్లడ్‌ప్రెషర్‌) పెరుగుతుంది. అలాగే డయాస్టోలిక్‌ ప్రెషర్‌ కూడా పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more : World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం..జీవ వైవిధ్యంలో గజరాజులు

కాఫీలో మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్‌’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి కాస్త టైమ్ తీసుకోవాలి. వెంట వెంటనే తాగకూడదు.కాఫీ.. యాంగ్జైటీ మరింత పెంచుతుంది. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. సో..కాఫీ తాగే విషయం జాగ్రత్త తప్పనిసరి.కాఫీ.. రెండు మూడు కప్పులు మహా అయితే నాలుగు కప్పులు మించకుండా తాగితేనే శరీరానికి మంచిది. అలాగే ఆరోగ్యానికీ మంచిది. కానీ కాఫీ తాగే విషయంలో మాత్రం అతి మంచిది కాదనే విషయం గుర్తుంచుకోండి. కాఫీ రుచిని ఆస్వాదించండీ హ్యాపీగా ఉండండీ. ‘హ్యాపీ కాఫీ డే టు కాఫీ లవర్స్’‌.

 

Read more : World Rhino Day 2021 : ఖడ్గమృగాల గురించి ఆసక్తికర విషయాలు