International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర.. మార్చి 8నే ఎప్పటి నుంచో తెలుసా

మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవల గురించి గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD).

International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర.. మార్చి 8నే ఎప్పటి నుంచో తెలుసా

Inernational Womens Day

International Women’s Day: మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అందిస్తున్న సేవల గురించి గుర్తు చేసుకునే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD). ఏటా మార్చి 8న జరుపుకునే ఈ ఉత్సవం 1911లో తొలి సారి మొదలైంది. దాదాపు శతాబ్ద కాలంగా ఈ రోజును ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు.

లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళా హక్కుల కోసం కొన్ని చోట్లు పాదయాత్రలు కూడా చేస్తుంటారు.

రంగుల ప్రత్యేకత

ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తుంటారు. పర్పుల్ అనేది న్యాయానికి, హుందాతనానికి గుర్తు అయితే పచ్చదనం ఆశావాదానికి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ ప్రతిపాదించిన మీదట యునైటెడ్ కింగ్‌డమ్ 1908లో కేటాయించింది.

Read Also: రాష్ట్రపతి చేతుల మీదుగా నారీమణులకు అవార్డుల ప్రదానోత్సవం

చరిత్ర:
19వ శతాబ్ధం తొలినాళ్లలో రాడికల్ భావజాలం పెరిగిపోయిన గందరగోళ పరిస్థితుల్లో ఈ మహిళా దినోత్సవం మొదలైంది. మహిళలపై వేధింపులు, అసమానత అంశాల పట్ల 1908లో సంస్కరణ కోసం ఉద్యమంలో పాల్గొని గొంతు వినిపించారు మహిళలు. అదే సమయంలో 15వేల మంది మహిళలు వేతనం, పని గంటలు, ఓటు హక్కు అంశాలపై న్యూయార్క్ నుంచి కవాతు చేశారు.

1910లో డెన్మార్క్‌లోని కోపెన్ హాగన్ శ్రామిక మహిళల రెండో అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. జర్మన్ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త అయిన క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించి.. ఏటా ప్రతి దేశంలో జరుపుకోవాలని సూచించారు.

17దేశాల నుంచి 100మంది మహిళలు, యూనియన్ లు, సోషలిస్ట్ పార్టీలు, శ్రామిక మహిళ సంస్థలు, ఫిన్నిష్ పార్లమెంట్ కు ఎంపికైన ముగ్గురు మహిళలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైంది.

Read Also : అంతర్జాతీయ మహిళా దినోత్సవం…తెలుగు రాష్ట్రాల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు. అనంతరం మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. 1975లో ఐక్యరాజ్యసమితి తొలిసారిగా స్పెషల్ గా గుర్తించింది.