Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసినందుకు ముగ్గురిని ఉరి తీసిన ఇరాన్

ఇరాన్‭లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు.

Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసినందుకు ముగ్గురిని ఉరి తీసిన ఇరాన్

3 Men Hang: గతే ఏడాది దేశ వ్యాప్తంగా కొనసాగిన నిరసనల్లో భద్రతా దళాల్లోని వ్యక్తుల మరణానికి కారణమయ్యాయంటూ ముగ్గురు నిరసనకారుల్ని ఇరాన్ ప్రభుత్వం ఉరి తీసింది. మజిద్ కజేమీ, సలేహ్ మిర్హాషెమీ, సయీద్ యాగౌబీలను సెంట్రల్ సిటీ ఇస్ఫహాన్‌లో ఉరితీశారు. వారు నవంబర్ 16న బసిజ్ పారామిలిటరీ దళానికి చెందిన ఇద్దరు సభ్యులను, ఒక పోలీసు అధికారి మరణానికి కారణమయ్యారని ఇరాన్ న్యాయవ్యవస్థ అధికారికత ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే ఇది ప్రస్తుతం దేశాన్ని కుదిపివేస్తోంది. నిరసనకారులను ప్రభుత్వం ఈ విధంగా అణచివేయడం ఏంటని ఇరాన్ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

PM Modi Japan Visit: జపాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. బోధి వృక్షాన్ని అక్కడ నాటడంపై కీలక వ్యాఖ్యలు

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించారని, వారిని తీవ్రంగా హింసించి ఉరికశిక్ష విధించినట్లు పేర్కొన్నారు. అయితే ఉరి తీసిన వ్యక్తుల్ని హింసించారనే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. గతేడాది నుంచి కొనసాగుతున్న ఈ నిరసన కారణంగా ఇప్పటి వరకు అధికారికంగా ఏడుగురుని ప్రభుత్వం ఉరి తీసింది. ఇక ఈ నిరసన వ్యక్తం చేసినందుకు గాను సుమారు 15,000 మందిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. మహ్సా అమినీ అనే 22 ఏళ్ల మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. దీనిని నిరసిస్తూ ఇరాన్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. 1979 అనంతరం ఆ దేశంలో ఇదే అతిపెద్ద నిరసన. మహ్సా ఘటన ఇరాన్ దేశాన్ని కదలించింది. మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి హిజాబ్‭లను కాల్చేస్తూ, జుట్టూ కత్తిరిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Rs.2000 denomination : అందుకే ప్రధాని విద్యావంతుడై ఉండాలనేది : రూ.2వేల నోట్ల రద్దుపై కేజ్రీవాల్ కేజ్రీ కామెంట్స్

ఇరాన్‭లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి దీనిపై చాలా కాలంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ, దీనిని సవరించడానికి ప్రభుత్వాలు సముఖంగా లేవు. కాగా, మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా అనేక దాడులు జరిగాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరిగాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.