Iraqi Man: హజ్ పర్యటనకై ఇరాక్ వ్యక్తి 6వేల 500కిలోమీటర్ల పాదయాత్ర

ఇరాకీ-కుర్దీష్ సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తి ఇంగ్లాండ్‌లోని వోల్వర్‌హ్యాంప్టన్‌కు చెందిన వ్యక్తి ఈ ఏడాది హజ్ కోసం పాదయాత్ర చేశాడు. ఆదమ్ మొహమ్మద్ (52)ఏళ్ల వ్యక్తి నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్, సౌదీ అరేబియాలను దాటి 10నెలల 25రోజుల్లో 6వేల 500కిలోమీటర్లు నడిచాడు.

Iraqi Man: హజ్ పర్యటనకై ఇరాక్ వ్యక్తి 6వేల 500కిలోమీటర్ల పాదయాత్ర

Mecca Tour

Iraqi Man: ఇరాకీ-కుర్దీష్ సంతతికి చెందిన బ్రిటీష్ వ్యక్తి ఇంగ్లాండ్‌లోని వోల్వర్‌హ్యాంప్టన్‌కు చెందిన వ్యక్తి ఈ ఏడాది హజ్ కోసం పాదయాత్ర చేశాడు. ఆదమ్ మొహమ్మద్ (52)ఏళ్ల వ్యక్తి నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనాన్, జోర్డాన్, సౌదీ అరేబియాలను దాటి 10నెలల 25రోజుల్లో 6వేల 500కిలోమీటర్లు నడిచాడు.

2021 ఆగష్టు 1న యూకేలో బయల్దేరిన ఆయన గత నెలలో సౌదీ అరేబియాకు చేరుకున్నాడు. ఒక్కో రోజు సగటున 17.8కిలోమీటర్లు ప్రయాణించేవాడట. 300కిలోమీటర్ల బరువున్న బండిలో ఇస్లామిక్ పారాయణాలతో ఉన్న స్పీకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. శాంతి, సమానత్వ సందేశాలను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా చేరుకున్నాడట.

తన కోసం GoFundMe పేజిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా కీర్తి, డబ్బు కోసం చేయడం లేదు. జాతి, రంగు, మతంతో సంబంధం లేకుండా మానవులంతా సమానమని ప్రపంచానికి తెలియజేయడానికి ఇలా చేశానని చెప్తున్నాడు. మార్గం మధ్యలో జనం తనపై కురిపించిన ప్రేమాభిమానాలకు పొంగిపోయానని పేర్కొన్నాడు.

Read Also : హజ్ యాత్రలో భద్రతకోసం తొలిసారి మహిళా సైనికులు

రెండు సంవత్సరాల విరామం తర్వాత, సౌదీ అరేబియా ఈ సంవత్సరం 1 మిలియన్ ముస్లింలను హజ్ చేయడానికి అనుమతించింది. 2020, 2021లో, హజ్ సౌదీ అరేబియా నివాసితులకు మాత్రమే అనుమతించింది. ఈ ఏడాది జూలై 7న హజ్ యాత్ర ప్రారంభమైంది.