విలేకరులపై శానిటైజర్ స్ర్పే చేసిన ప్రధాని

చిన్నబాటిల్ లో ఉన్న శానిటైజర్ ను విలేకరులపై స్ప్రే చేశారు ప్రధాని ప్రయూత్ చాన్ ఓదా.

విలేకరులపై శానిటైజర్ స్ర్పే చేసిన ప్రధాని

Irked Thai PM

Irked Thai PM : మీడియా అడిగిన ప్రశ్నలకు చిర్రెత్తుకొచ్చినట్లుంది ఆ ప్రధానికి. ఏకంగా..మీడియా ప్రతినిధులపై శానిటైజర్ స్ప్రే చేశారు. ఎదుట కూర్చొన్న విలేకరులపై ఒక్కొక్కరిపై స్ర్పే చేసుకుంటూ..ముందుకు వెళ్లారు. థాయ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓదా ఈ విధంగా చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రపంచాన్ని కరోనా ఇంకా భయపెడుతూనే ఉంది. వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ వైరస్ రాకుండా..ఉండాలంటే..కేవలం మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కూడా. ప్రజలకు పంపిణీ కూడా చేసేస్తున్నారు. ప్రధానంగా శానిటైజర్ ను రక్షణ కవచంగా భావిస్తున్నారు.

థాయో లో మంగళవారం ప్రధాని ప్రయూత్ చాన్ ఓదా ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉన్న మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న మూడు ఖాళీ స్థానాలను ఏ అభ్యర్థులతో భర్తీ చేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ఆయన..తనకు తెలియదు..అంటూ విలేకరుల వద్దకు వచ్చారు. చిన్నబాటిల్ లో ఉన్న శానిటైజర్ ను విలేకరులపై స్ప్రే చేశారు. ఏడేళ్ల క్రితం జరిగిన నిరసనల్లో తిరుగుబాటుకు పాల్పడ్డారంటూ..ప్రధాని కేబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులకు ఇటీవలే జైలు శిక్ష ఖరారైంది.