Islamic State: ఐసీసీ చీఫ్ అబూ హసన్ అల్ ఖురేషీ హతం.. కొత్త చీఫ్‌గా అబూ అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషి

అంతర్జాతీయ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ హసన్ అల్ హషిమి అల్ ఖురేషి మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆయన మరణంతో ఐసిస్ కొత్త చీఫ్‌ను ఎన్నుకుంది.

Islamic State: ఐసీసీ చీఫ్ అబూ హసన్ అల్ ఖురేషీ హతం.. కొత్త చీఫ్‌గా అబూ అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషి

Islamic State: ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబూ హసన్ అల్ హషిమి అల్ ఖురేషి మరణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. బుధవారం ఈ వివరాలు వెల్లడిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసింది. దేవుడి శత్రువులతో జరిగిన యుద్ధంలో హషిమి ప్రాణాలు కోల్పోయాడని ఆ సంస్థ తెలిపింది. హషిమి ఇరాక్‌కు చెందిన వ్యక్తి.

Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

అయితే, అతడు ఎప్పుడు మరణించాడు అనే వివరాల్ని మాత్రం ఐసిస్ వెల్లడించలేదు. అబూ హసన్ అల్ ఖురేషీ మరణంతో ఐసిస్ సంస్థ కొత్త చీఫ్‌ను ఎన్నుకుంది. ఐసిస్ కొత్త చీఫ్‌గా అబూ అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషి ఎన్నికైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఐసిస్ గత దశాబ్దంలో బాగా అభివృద్ధి చెందిన తీవ్రవాద సంస్థ. 2014లో ఇరాక్, సిరియాల్లో ఐసిస్ అనేక అరాచకాలకు పాల్పడింది. అయితే, 2017లో ఇరాక్‌లో, 2019లో సిరియాలో ఈ సంస్థకు ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో అధికారికంగా కనుమరుగైంది. కానీ, స్లీపర్ సెల్స్ రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరాక్, సిరియాతోపాటు ప్రపంచంలోని అనేక చోట్ల దాడులు చేస్తోంది.

Delhi liquor scam: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు

ఈ నేపథ్యంలో ఐసిస్‌పై నిషేధం కొనసాగుతోంది. ఈ సంస్థకు అంతకుముందు చీఫ్‌గా కొనసాగిన అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ గత ఫిబ్రవరిలో హతమయ్యాడు. అంతకుముందు ఉన్న నేత అబూ బకర్ అల్ బగ్దాది అమెరికా బలగాల చేతిలో హతమయ్యాడు.