Israel Attacks Syria Airbase : సిరియా మిలిటరీ ఎయిర్ బేస్‌పై మిసైల్స్‌తో ఇజ్రాయెల్ దాడి

సిరియాపై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింది.

Israel Attacks Syria Airbase : సిరియా మిలిటరీ ఎయిర్ బేస్‌పై మిసైల్స్‌తో ఇజ్రాయెల్ దాడి

Israel attacks Syria air base with missiles

Updated On : November 14, 2022 / 1:04 PM IST

Israel Attacks Syria Airbase : సిరియాపై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

హామ్స్ నగరానికి ఆగ్నేయంగా ఉన్న విశాలమైన ఎయిర్ బేస్ రన్ వేని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ విమానాశ్రయాన్ని కొంత కాలంగా ఇరాన్ వైమానిక దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ రెండు నెలల క్రితం సిరియా రాజధాని డమాస్కస్ పై దాడి చేసింది. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఆ దాడుల్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.