Ivana Trump will : డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా పెద్ద మనస్సు.. పెంపుడు కుక్కతో పాటు సహాయకురాలికి ఆస్తిలో వాటా
డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా రాసిన వీలునామా సంచలన సృష్టిస్తోంది. తన వీలునామాలో ఇవానా తన పెంపుడు కుక్కతో పాటు సహాయకురాలికి ఆస్తిలో వాటా రాసిచ్చినట్లుగా ఉంది.

Ivana Trump will : కుక్కనైనా కాకపోతిని అనేలా ఉంటాయి శ్రీమంతుల ఇళ్లల్లో శునకాల భోగాలు చూస్తే. పెంపుడు కుక్కలను ప్రేమతో సాకటమేకాదు వాటికి ఆస్తులు కూడా రాసిచ్చినవారు ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ భార్య అంటే మొదటి భార్య ఇవానా ట్రంప్ కూడా ఆ జాబితాలో చేరినట్లుగా తాజాగా బయటపడిన వీలునామాలో తెలిసింది. ఇవానా ట్రంప్ రాసిన వీలునామా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. ఈ వీలునామాలు ఇవానా తన పెంపుడు కుక్కపైన ఉన్న ప్రేమ కనిపిస్తోంది. తన చివరి రోజుల్లో అండగా ఉన్న ఓ పెంపుడు కుక్కకు ఆమె ఆస్తిలో వాటా రాసిచ్చారు. అంతేకాదు చివరి రోజుల వరకు తనకు సహాయంగా ఉన్న మహిళకు కూడా తన ఆస్తిలో వాటా ఇచ్చారు ఇవానా. ఈ విషయం ఆమెరాసిన వీలునామాలో పొందుపరిచారు.
73 ఏళ్ల వయస్సులో ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ 2022 జూలైలో మరణించారు. తన నివాసంలోనే ఇంటి మెట్లపై నుంచి జారిపడి మరణించారామె. ట్రంప్‌తో విడాకులు తీసుకున్న ఇవానాకు మాన్‌హట్టన్‌లోని ఈ అత్యంత వైభంగా ఉండే విలాసవంతమైన బంగ్లా ఆమెకు వచ్చింది. ఈ బంగ్లాను ఆమె అమ్మగా దాదాపు రూ.215 కోట్లు వచ్చాయి. ఆమె మరణించకముందే ఇవానా తన ఆస్తులను తన ముగ్గురు పిల్లలకు పంచారు. అంతేకాదు తనకు ఎంతో ఇష్టమైన తన పెంపుడు కుక్కకు కూడా ఇవానా ఆస్తి రాసిచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.
Trump Wife Ivana Death : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి
తన జీవిత చరమాంకంలో తనను ఆహ్లాదం పరిచిన తన పెంపుడు కుక్క టైగర్ ట్రంప్‌కు తన ఆస్తిలో వాటా ఇచ్చారు. ఈ భూమిని వదిలిపెట్టిపోయే సమయంలో తన ఇంట్లో ఉండే అన్ని రకాల జంతువులకు ఆస్తిలో వాటా అందాలని ఆమె వీలునామాలో పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ నుంచి దూరమైన తర్వాత తన బాగోగులను చూసిన సేవకురాలు సుజానా డోర్తీ కర్రీకి మియామీ బీచ్ సమీపంలోని విలువైన అపార్ట్‌మెంట్‌ను రాసిచ్చారు. దాన్ని కూడా వీలునామాలు పొందుపరిచారు.
ఇవానా ట్రంప్ ఆస్తి విలువ మొత్తం 34 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.280 కోట్లు ఆస్తిని ముగ్గురు పిల్లలకు సమానంగా పంచారు. సుజానాకు ఇచ్చిన మియామీ బీచ్‌లోని అపార్ట్‌మెంట్ (1000 చదరపు అడుగులు) ఖరీదు దాదాపు రూ.9 కోట్లు విలువ ఉంటుంది. ఈ అపార్ట్‌మెంట్‌ను ఇవానా 2009 లో రూ.5.25 కోట్లకు కొన్నారు. 2017 లో వెలువడిన ఇవానా పుస్తకం రైజింగ్ ట్రంప్‌లో కూడా సుజానా గురించిన ప్రస్తావించారు. తన ముగ్గురు పిల్లలు పెద్దయ్యే వరకు వారి బాగోగులు చూసిన సుజానా అనే సహాయకురాలు ఆమె కేవలం హెల్పర్ మాత్రమేకాదు తన కుటుంబ సభ్యులుగా భావించారామె. ఆ తరువాత కూడా సుజానా ఇవానాకు సహాయకురాలుగా ఉన్నారు.
తన వీలునామాలో వార్డ్ రోబ్ వస్తువులను కూడా ఇవానా అందరికి సమానంగా పంచారు.ఆమె వార్డ్‌రోబ్‌లో రెడ్‌క్రాస్, సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫర్ కలెక్షన్, నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా తన పిల్లలకు ఇవ్వాలని వీలునామాలో రాశారు. కాగా..ఇవానాను డొనాల్డ్ ట్రంప్ 1977లో వివాహం చేసుకున్నారు. 1992లో విడాకులు తీసుకున్నారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ముగ్గురు సంతానం.