Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం, సునామీ ముప్పుపై అధికారులు ఏమన్నారంటే..

జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.

Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం, సునామీ ముప్పుపై అధికారులు ఏమన్నారంటే..

Japan Earthquake : భూకంపం.. ఈ పేరు చెబితే చాలు జనాలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. భూకంపం సృష్టించే విలయం అంతా ఇంతా కాదు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రపంచంలో రోజు ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. టర్కీ, సిరియాలో భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మంది మృత్యువాత పడ్డారు. పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. టర్కీ, సిరియా భూకంపం తర్వాత ఆ పేరు మాట వింటనే చాలు జనాలు హడలిపోతున్నారు.

Also Read..Turkey and Syria Earthquake: టర్కీ, సిరియాలో 50వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

తాజాగా జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.

నెమురో ప్రాంతంలో 61 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (ఎన్ఐఈడీ) వెల్లడించింది. ఆస్తినష్టం, గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. భారీ భూకంపం వచ్చినా సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.

Also Read..Earthquake: టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాక్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా?

జపాన్‌లోని ప్రధాన ఉత్తర దీవుల్లో ఒకటి హోక్కైడో ద్వీపం. కొన్ని రోజుల క్రితమే అక్కడ భూకంపం సంభవించింది. అప్పుడు 5.1 తీవ్రతో భూకంపం వచ్చింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న జపాన్ కు భూకంపాల ముప్పు ఎక్కువ. అక్కడ తరుచుగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వల్ల భూకంపాలు వస్తుంటాయి. జపాన్ భూభాగం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ యాక్టివిటీ అధికంగా ఉండే ప్రాంతంలో ఉండటం కూడా భూకంపాలు ఎక్కువగా రావడానికి మరో కారణం. తరుచుగా భూకంపాలు వస్తుండటంతో..ఇక్కడి ఇళ్లను భూకంపాలను తట్టుకునే విధంగా కలప, తేలికపాటి పదార్థాలతో నిర్మిస్తుంటారు. ఇక, భూకంపాలను గుర్తించేందుకు జపాన్ అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతోంది.