Earthquake: టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాక్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా?

టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాకిస్థాన్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు సంభవిస్తాయి? ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల ధాటికి 21,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాక్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా?

Earthquake

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించినట్లే భారత్, పాకిస్థాన్ లోనూ భారీ భూకంపాలు వస్తాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు సంభవిస్తాయి? ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాల ధాటికి 21,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే, త్వరలోనే భారత ఉపఖండంలోనూ భారీ భూకంపాలు వస్తాయంటూ నెదర్లాండ్స్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ చెప్పారు. అతడే కొన్ని రోజుల క్రితం టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసి తెలిపారు. దీంతో అతడు తాజాగా భారత్-పాక్ లో భూకంపాలు వస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఫ్రాంక్ హూగర్బీట్స్ ట్విట్టర్ ఖాతాలో ఉన్న వివరాల ప్రకారం ఆయన నెదర్లాండ్స్ లోని సోలార్ సిస్టమ్ జియామెట్రీ సర్వే (SSGS)లో పనిచేస్తున్నారు. అఫ్గానిస్థాన్ లో భారీ భూకంపం మొదలై పాకిస్థాన్, భారత్ మీదుగా ప్రకంపనలు సృష్టించి హిందూ మహాసముద్రంలో ముగుస్తుందని ఆయన చెప్పారు. ఫ్రాంక్ హూగర్బీట్స్ ఆయా విషయాలు వెల్లడించిన వీడియోను పాకిస్థాన్ అధికారి ముహమ్మద్ ఇబ్రహీం షేర్ చేశారు.

టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవిస్తాయని ముందుగానే అంచనా వేసిన ఫ్రాంక్ హూగర్బీట్స్ ఇప్పుడు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్ లోనూ భూకంపాలు సంభవిస్తాయని చెబుతున్నారని ముహమ్మద్ ఇబ్రహీం తెలిపారు. ఏయే ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయన్న వివరాలను ఫ్రాంక్ హూగర్బీట్స్ ఓ వీడియోలో చెప్పారు. అయితే, ఆయన చెప్పిన వివరాలను పాకిస్థాన్ వాతావరణ శాఖ కొట్టిపారేసింది. భూకంపం సంభవిస్తుందన్న ఆ అంచనాల్లో శాస్త్రీయత లేదని తెలిపింది.

Pawan Kalyan : సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పవన్ ఇచ్చిన మోటివేషన్..