Cockroach Beer : బొద్దింక‌ల‌తో బీరు తయారీ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు

బొద్దింక‌ల‌తో తాయరు చేసే బీరును మందుబాబులు లొట్టలేసుకుంటు తాగేస్తున్నారు. పైగా మగ బొద్దింకలతో తయారు చేసే ఈ బీరుకు ఫుల్ డిమాండ్ ఉంది.

Cockroach Beer : బొద్దింక‌ల‌తో బీరు తయారీ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు

Cockroach Beer

Cockroach Beer : చల్ల చల్లగా బీరు గొంతులోకి దిగుతుంటే ఆ మజాయే వేరు అని బీరుబాబులు ఫీల్ అవుతుంటారు. బార్లీ గింజ‌ల‌తో..కొన్నిరకాల ధాన్యాలను నానబెట్టి..వాటిని పులియబెట్టి తయారు చేస్తారు. కానీ..జపాన్ లో మాత్రం వెరీ డిఫరెంట్. అక్కడ తయారయ్యే ‘బొద్దింకల బీరు’కు ఫుల్ డిమాండ్ ఉంది. బొద్దింక‌ల‌ను ఉడ‌క‌బెట్టి.. వాటి నుంచి ర‌సం తీసి.. ఆ ర‌సంతో త‌యారు చేసిన బీరు కోసం జపాన్ వాసులు ఎగ‌బ‌డ‌తారట.

జ‌పాన్‌లో మాత్రమే ఈ బొద్దింకల స్పెష‌ల్ బీరు దొరుకుతుంది. ఈ బీరును అలాంటిలాంటి బొద్దింకలతో తయారుచేయరండోయ్..బీరు తయారు చేయటానికి తైవాన్‌లో ఉండే మ‌గ బొద్దింక‌ల‌తో మాత్రమే త‌యారు చేస్తారట..!! ఈ బొద్దింక‌లు..నీళ్ల‌లో నివసించే క్రిమి కీట‌కాలను తిని జీవిస్తాయట..!!

Read more : International Beer Day : ‘బీర్‌’ పుట్టుకకు మూలం మహిళలే..బీరు డే ‘అలా మొదలైంది’..

ఈ బొద్దింక‌ల‌ను నీళ్ల‌లో కొన్ని రోజుల పాటు ఉడికించి ఆ త‌ర్వాత వాటి నుంచి వ‌చ్చే జ్యూస్ తో అంటే వాటిని ఉడికించగా వచ్చిన ర‌సంతో బీరును త‌యారు చేస్తారు. జ‌పాన్‌లో బీరు త‌యారు చేసేందుకు ఒక సంప్రదాయమైన ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ పేరు ‘క‌బుటోకామా’. ఈ సంప్రదాయ ప‌ద్ధ‌తితో బీరు త‌యారు చేస్తారు. జపాన్‌లో తైవాన్ మ‌గ బొద్దింక‌ల‌కుండే డిమాండ్ అంతా ఇంతా కాదు.

ఫ్రై చేసుకుని తింటారు. ఫ్రైడ్ రైస్ లో వేసుకుని తింటారు. సూపులు తయారు చేస్తారు. ఇంత వంటకాల్లో విరివిగా వాడతారు. వాటిని ఎలా వండినా సరే లొట్ట‌లేసుకుంటూ తింటారు జపాన్ వాసులు. ఈ బొద్దింక‌ల‌ను త‌రుచుగా తింటే ఆరోగ్యంగా ఉంటార‌ని.. పైగా ఆయుషు పెరిగి ఎక్కువ కాలం జీవిస్తార‌ని జ‌ప‌ాన్ వాసుల న‌మ్మకం. అందుకే.. ఆ బొద్దింక‌ల‌కు అక్క‌డ అంత గిరాకీ.

Read more : తండ్రి ఆఖరి కోరిక : నా అస్థికలను బీరులో కలిపి అక్కడి డ్రైనేజీలో పొయ్యండీ..

సూప్‌ల‌తో పాటు ఇప్పుడు ఆ బొద్దింక‌ల‌తో బీరు కూడా త‌యారు చేస్తుండ‌టంతో ఆ బీరుకు జ‌పాన్‌లో ఫుల్ గిరాకీ వ‌స్తోంది. ఆ బీరుకు ‘కొంచు సోర్ బీర్’ అనే పేరు పెట్టి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఒక్కో బీరు బాటిల్‌ మ‌న క‌రెన్సీలో 300 రూపాయ‌లు ఉంటుంది.