Live Parasitic in Pen: పెన్నులో పురుగు.. కొనేందుకు విపరీతమైన డిమాండ్!

ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళ జేబుల్లో కూడా పెన్ కనిపించడంలేదు కానీ ఒకప్పుడు పెన్నులకు ఫుల్ డిమాండ్ ఉండేది. కొందరైతే రకరకాల పెన్నులను సేకరించడం కూడా హాబీగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో బ్యాంకులు, కొన్ని ఆఫీసులలో మాత్రమే పెన్నులతో అవసరం పడుతుండగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వంటి వారే కొందరు వాడుతున్నారు.

Live Parasitic in Pen: పెన్నులో పురుగు.. కొనేందుకు విపరీతమైన డిమాండ్!

Japanese Ballpoint Pen Comes With A Live Parasitic Worm

Updated On : April 17, 2021 / 4:48 PM IST

live parasitic in pen: ఈ మధ్య కాలంలో చదువుకున్న వాళ్ళ జేబుల్లో కూడా పెన్ కనిపించడంలేదు కానీ ఒకప్పుడు పెన్నులకు ఫుల్ డిమాండ్ ఉండేది. కొందరైతే రకరకాల పెన్నులను సేకరించడం కూడా హాబీగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో బ్యాంకులు, కొన్ని ఆఫీసులలో మాత్రమే పెన్నులతో అవసరం పడుతుండగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వంటి వారే కొందరు వాడుతున్నారు. మొత్తంగా వీటి వాడకం చాలా తగ్గిపోయింది. మన దగ్గరే ఇలా ఉంటే ఇక అభివృద్ధి చెందిన దేశాలలో వీటిని కొనేవారు ఉంటారా అనిపిస్తుంది. కానీ జపాన్ లో మాత్రం ఒక పెన్నుకు విపరీతమైన డిమాండ్ ఉంది. దానిని కొనేందుకు ఆన్ లైన్ లో తెగ వెతికేస్తున్నారు. కానీ డిమాండ్ వలన అది దొరకడం లేదు.

అంతగా డిమాండ్ ఉన్న ఆ పెన్నులో ప్రత్యేకత ఏంటంటే అందులో బ్రతికున్న పురుగు ఒకటి ఉంటుంది. దీనిని ఆప్యాయతకు, ప్రేమకు గుర్తుగా జపాన్ యువత ఒకరికి ఒకరు పంచుకుంటున్నారు. అందుకే దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందట. జపాన్‌కు చెందిన ఓ సంస్థ బతికున్న నెమటోడ్ అనే పరాన్న జీవిని పెన్నులో పెట్టి అమ్ముతున్నారు. అది బయటకు చాలా స్పష్టంగా కనిపిస్తూ అందులో ఉన్న నీటిలో ఆ పరాన్న జీవి కదులుతూ ఉండడంతో చూసేందుకు కొత్తగా కనిపిస్తుంది. దీంతో వినియోగదారులు ఈ పెన్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ ప్రత్యేకమైన పెన్నును తమ ఆప్తులకు, ప్రేమకు గుర్తుగా కానుకగా ఇచ్చేందుకు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. పైగా ఈ పెన్ను మంచి టైంపాస్ కూడానట. పెన్ను లోపల దాని కదలికలను చూస్తూ ఎంతసేపైనా గడిపేయొచ్చట. అయితే.. ఇందులో ఉండే ఈ పరాన్న జీవి కేవలం మూడునాలుగురోజుల వరకే బతికి ఉంటుంది. కానీ ఆ మూడునాలుగు రోజులకే ఈ పెన్ను ఇంతగా ఎగబడి కొంటున్నారు. ఈ పెన్ 950 యెన్ అంటే మన కరెన్సీలో దాదాపు 700 వరకు ఉంటుంది. అయినా ఈ పెన్ కొనేందుకు జపనీయులు ఆన్లైన్ లో తెగ వెతికేస్తున్నారు.

ఇప్పటికే ఈ పెన్నును కొన్న వారు ఆ పురుగు పెన్నులో తిరిగే వాటిని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లు ఇదేదో బాగుందే ఒకసారి మనమూ చూద్దాం అంటూ కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా అలా అలా ఆసక్తి పెరిగి ఈ పెన్నుకు ఇప్పుడు ఇక్కడ ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

Read: Bhima Jewelers Advertise: అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన సున్నితకథ!