Man 100 Years : 100 ఏళ్లు జీవించటం మన చేతుల్లోనే ఉంది అంటున్న శాస్త్రవేత్తలు..

ఒకప్పుడు మనిషి అనేవాడు వందేళ్లు బతికేవాడు. ఐతే ఇప్పుడు వందేళ్లు బతికిన మనిషులను చూస్తే.. ఏదో అద్భుతంలా అనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్లు... మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నాయ్. 60ఏళ్లకే పరిమితం చేస్తున్నాయ్. జపాన్‌లో మాత్రం వందేళ్లు దాటుతున్న వారు.. ఏటా పెరుగుతున్నారు. దీంతో వందేళ్లు బతకడం ఎలా అని సైంటిస్టులు ప్రయోగం మొదలుపెట్టారు. అధ్యయనాలు చేసి.. కీలక విషయాలు రాబట్టారు. ఇంతకీ సైంటిస్టుల స్టడీలో తేలిందేంటి ?

Man 100 Years : 100 ఏళ్లు జీవించటం మన చేతుల్లోనే ఉంది అంటున్న శాస్త్రవేత్తలు..

Man 100 Years

MAN 100 YEARS : ఒకప్పుడు మనిషి అనేవాడు వందేళ్లు బతికేవాడు. ఐతే ఇప్పుడు వందేళ్లు బతికిన మనిషులను చూస్తే.. ఏదో అద్భుతంలా ఫీల్ అవాల్సిన పరిస్థితి. ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్లు… మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నాయ్. 60ఏళ్లకే పరిమితం చేస్తున్నాయ్. జపాన్‌లో మాత్రం వందేళ్లు దాటుతున్న వారు.. ఏటా పెరుగుతున్నారు. దీంతో వందేళ్లు బతకడం ఎలా అని సైంటిస్టులు ప్రయోగం మొదలుపెట్టారు. అధ్యయనాలు చేసి.. కీలక విషయాలు రాబట్టారు. ఇంతకీ సైంటిస్టుల స్టడీలో తేలిందేంటి ?

భారత ప్రధాని మోదీ తల్లి.. ఈ మధ్యే 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వందేళ్ల జీవితంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు వందేళ్లు బతకడం సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది. ఐతే సైంటిస్టుల ప్రయోగాలు అది సాధ్యమే అంటున్నాయ్. కాకపోతే కండిషన్స్ అప్లయ్‌ అంటున్నారు.

Also read : PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

ఒకప్పుడు వందేళ్లు బతకడం చాలా ఈజీ ! మన పూర్వికులు కూడా అదే చెప్పేవారు. ఐతే ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడమే అసాధ్యంగా అనిపిస్తోంది. కాలుష్యం పెరుగుతోంది.. కాలాలు మారుతున్నాయ్.. వాతావరణం మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. వందేళ్ల జీవితం గురించి ఆలోచించడం కాదు కదా.. ఊహించడం కూడా సాధ్యం కాదేమో అనిపిస్తోంది. ఐతే ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే మార్పులు కనిపిస్తున్నాయ్. ప్రపంచమంతా నూరేళ్లు బ్రతకాలంటే ఏమి చేయాలి అనే విషయం పై కొన్ని అధ్యయనాలు జరుగుతున్నాయ్. ఏం చేయాలి.. ఎలా ఉండాలి.. ఎలా బతకాలి.. ఇలా ప్రతీ విషయంలో మార్పులు సూచిస్తున్నారు. నూరేళ్లు బ్రతకడం అసాధారణమేమీ కాదు అంటున్నారు జపాన్ సైంటిస్టులు.

జపాన్‌లో మహిళల సగటు వయసు 88 ఏళ్ళు కాగా… పురుషుల సగటు వయసు 82 ఏళ్లు. ఆ దేశ జనాభాలో 29శాతం మంది 60 ఏళ్లు దాటిన వారే ! సగటు వయసు విషయంలో హాంగ్‌కాంగ్‌, సింగపూర్, స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్ మాత్రమే జపాన్‌కు దగ్గరగా ఉంటాయ్. గతేడాది జపాన్‌లో 86వేల 510 మంది పౌరులు వంద సంవత్సరాలు దాటారు. దీంతో వందేళ్లు బతకడం ఎలా అన్న దానిపై సైంటిస్టులు ఆరా తీస్తున్నారు. జపాన్‌లో జనాల ఆయుర్దాయం ఎక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయ్. అందులో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానం ఒకటి. ప్రభుత్వ విధానాలతో పాటు జపాన్‌లో జనాలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారి జీవన శైలి కూడా ఆరోగ్యకరంగా ఉండటమే దానికి కారణం.

జపాన్‌లో జనాలు చాలా కష్టపడే తత్త్వం ఉన్నారు. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తినే తిండిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొవ్వు పదార్ధాలు తక్కువగా తింటారు. చేపలు, కూరగాయలు ఎక్కువగా తింటారు. గ్రీన్ టీ తాగుతారు. ఇక్కడ జననాల రేటు తగ్గుతోంది. ఉద్యోగం చేసే వయసులో ఉండే జనాభా సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జపాన్‌లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా.. ప్రజలు కొత్త ఉద్యోగాలు చేస్తారు. వారు పదవీ విరమణ తర్వాత సెకండ్‌ లైఫ్‌తో పాటు సెకండ్ కెరీర్‌ స్టార్ట్ చేస్తారు. దీంతో వారి లైఫ్‌ పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతుంది. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది.

Also read : ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన 110 ఏళ్ల బామ్మ

జపాన్‌లో వందేళ్లు దాటుతున్న వారి సంఖ్య.. ఏటా పెరుగుతుండగా.. దీనిపై పరిశోధనలు పెరుగుతున్నాయ్. నిజానికి వయసు పెరిగే కొద్దీ.. మెదడు పరిమాణం తగ్గుతుంది. దీంతో, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పనులు చేసే సామర్ధ్యం తగ్గుతుంది. ప్రవర్తనలో మార్పులు వస్తాయ్. వాళ్లు ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. ఐతే అందరిలోనూ ఈ లక్షణాలు ఒకేలా ఉండే అవకాశం లేదు. కొన్ని ప్రయత్నాలతో వయసు పెరిగే ప్రక్రియను మందగించేలా చేయవచ్ని.. న్యూయార్క్‌లోని ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు చెప్తున్నారు. ఇక ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రేమానుబంధాలతో ఉండేవారికి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని.. హార్వర్డ్ సైంటిస్టులు చెప్తున్నారు. 84 సంవత్సరాలుగా 724మందిపై చేసిన అధ్యయనంలోనే ఈ వివరాలు తెలిశాయ్. ఆ 724మంది టీనేజీలో ఉన్నప్పుడు స్టడీ మొదలుపెట్టారు. వారిలో చాలామంది 90ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు.

Old Woman World Record : 100 ఏళ్ల బామ్మ వెయిట్‌లిఫ్టింగ్ లో గిన్నిస్ రికార్డ్..తగ్గేదేలేదంటున్న సెంచరీ నారీ

ఒత్తిడి, ఆందోళన లేకపోతే.. జీవితకాలం మరింత పెరుగుతుందని ఆ అధ్యయనంలో తేలింది. చాలాకాలం బతికి ఉండాలంటే.. ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరం. అది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఇలా చేస్తే వందేళ్లు బతుకుతారా అంటే.. దానికి ప్రత్యేకమైన సమాధానం ఏమీ లేదు.. కొన్ని పనులు చేయడం ద్వారా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. మాట్లాడేందుకు స్నేహితులో… పెంపుడు జంతువో ఉండేటట్లు చూసుకోవాలి. నిజానికి వయసును తగ్గించేందుకు.. లేదంటే వెనక్కి మరలించేందుకు ప్రత్యేకంగా ఫార్ములా లేదు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ దిశగా కృషి చేస్తున్నారు.