PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

PM Modi Mother 100th Birthday : తల్లి 100వ పుట్టిన రోజు..పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

Pm Modi Mother 100th Birthday

Updated On : June 18, 2022 / 12:09 PM IST

PM Modi mother 100th birthday : రాజ్యానికి రాజు అయినా తల్లికి బిడ్డే అంటారు. అలా నరేంద్రమోడీ కూడా అంతే. ప్రత్యేక రోజులు..ముఖ్యమైన సందర్భాల్లో మోడీ తల్లి పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు అందుకుంటారు. అలా ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆయన తల్లికి పాదపూజ్ చేశారు. అనంతరం మాతృమూర్తినుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ 100వ పుట్టినరోజు సందర్భంగా తన తల్లిని మోదీ కలిశారు. శనివారం (18,2022) ఉదయం గుజరాత్ లోని గాంధీనగర్ లోని తన తల్లి నివాసానికి వెళ్లారు. తల్లికి పాదపూజ చేసి..ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయి తినిపించారు.

ప్రస్తుతం మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ ను సందర్శించనున్నారు. హీనాబెన్ చిన్న కుమారుడు పంకజ్ మోదీ వద్ద ఉంటున్న ఆమె 100 ఏళ్ల పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ చక్కటి ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యానికి కారణం సాత్వికాహారమే కారణం అని అంటుంటారు. స్వీట్స్ విషయానికి వస్తే షుగర్ క్యాండీని ఇష్టపడతారట.