జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపై కేసు వేసిన కొడుకు..తర్వాత

కన్నందుకు తనను జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపైనే కోర్టులో కేసు వేశాడో ఓ కొడుకు.

10TV Telugu News

Life Long Financial Support : కన్నందుకు తనను జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపైనే కోర్టులో కేసు వేశాడో ఓ కొడుకు. దమ్మిడిగా ఆస్తులుండడంతో ఇంట్లోనే ఉంటూ..తలిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొనేవాడు. ఉన్నత విద్య చదివిన ఇతను..కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది.

లండన్ లో 41 సంవత్సరాల వయస్సున్న ఫైజ్ సిద్దిఖీ తల్లిదండ్రులపై ఆధార పడి జీవిస్తున్నాడు. ఇతను దుబాయ్ కు చెందిన వాడు. ఇతను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లా చదివాడు. ఇతని తల్లిదండ్రులకు సంపాదన, ఆస్తులు బాగానే ఉన్నాయి. దీంతో సిద్దిఖీ ఎలాంటి ఉద్యోగం చేయకుండా..ఇంట్లోనే ఉన్నాడు. 2011 నుంచి ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. అంతేగాకుండా..తల్లిదండ్రుల నుంచి వారానికి 400 పౌండ్లు పొందేవాడు. ఇంత వరకు బాగానే ఉంది. ఇటీవలే తల్లిదండ్రులకు సిద్దిఖీ..మధ్య గొడవ జరిగింది. దీంతో డబ్బులు ఇవ్వడం మానివేశారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో..కోర్టుకు వెళ్లాడు సిద్దిఖీ. కన్నందుకు తల్లిదండ్రులు జీవితాంతం పోషించే విధంగా చూడాలని..ఈ మేరకు తన తల్లిదండ్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో వెల్లడించారు. పిటిషన్ ను పరిశీలించిన కోర్టు…సున్నితంగా..తిరస్కరించింది. ఈ కేసును ఎగువ కోర్టుకు అప్పీల్ చేసిన అతడు.. తల్లిదండ్రుల మీద పోరాటం చేస్తున్నాడు. గతంలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంపై కూడా కేసును దాఖలు చేశాడు సిద్దిఖీ. విద్యాబుద్ధులు చెప్పిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మీదనే కేసు వేశాడు. తనకు ఉద్యోగం రాకుండా ఉండటానికి కారణం యూనివర్సిటీనని అతడు ఆరోపిస్తున్నాడు. అక్కడ టీచింగ్ బాగోలేదని.. తన కెరీర్ కు నష్టం చేసినట్లు వాదించాడు. కేసు వేసే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ కాలేదు.