గొంతు తగ్గించి మాట్లాడు…మహిళా రిపోర్టర్ పై ట్రంప్ అసహనం

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 03:54 PM IST
గొంతు తగ్గించి మాట్లాడు…మహిళా రిపోర్టర్ పై ట్రంప్ అసహనం

తనను ప్రశ్నించిన ఓ మహిళా రిపోర్ట్ పై అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో తాను తీసుకున్న నిర్ణయాలకు తనను ప్రశంసించాల్సిందేనని ఆ మహిళా రిపోర్టర్ కు ట్రంప్ సూచించారు.

సోమవారం  వైట్ హౌస్ లో ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో వాషింగ్టన్‌లోని ఓ ప్రముఖ వార్తా సంస్థకు చెందిన వెయిజియ జాంగ్ అనే మహిళా రిపోర్టర్…దేశంలోకి కరోనా వైరస్ ఫిబ్రవరిలో ప్రవేశించిందని, ఆ సమయంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎటుంవంటి చర్యలు తీసుకుందంటూ ట్రంప్‌ను ప్రశ్నించింది. రిపోర్టర్ ప్రశ్నకు స్పందించిన ట్రంప్…. మీరు గొంతు తగ్గించి మాట్లాడండి..నేను చెప్పేంది వినండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్ వల్ల దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం మీకు ముందే తెలుసని మార్చి 21న చెప్పారు. అయితే అప్పటి వరకు ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని రిపోర్టర్ ప్రశ్నించగా… దీనికి ట్రంప్ సమాధానమిస్తూ,..నేను దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే నాటికి దేశంలో ఎంతమంది కరోనా బాధితులున్నారో మీకు తెలుసా.. అప్పటికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మీకు తెలుసా.. లాక్‌డౌన్ విధించే నాటికి దేశంలో ఒక్క మరణం కూడా లేదు. అంత త్వరగా స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు మీరే నాకు కృతజ్ఞతలు చెప్పాలి అని అనడంతో సదరు రిపోర్టర్ అవాక్కయింది.

Also Read | ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం