France: పార్కులో ప్రజలపై కత్తితో దాడి చేస్తూ రెచ్చిపోయిన యువకుడు.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

ఈ దాడిలో చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి.

France: పార్కులో ప్రజలపై కత్తితో దాడి చేస్తూ రెచ్చిపోయిన యువకుడు.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం

France knife attack

France – Knife attack: ఫ్రాన్స్‌లోని ఆల్పైన్ (Alpine town) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు ప్రజలపై కత్తితో దాడి చేసుకుంటూ దూసుకెళ్లాడు. ఈ దాడిలో చిన్నారులు సహా పలువురికి గాయాలయ్యాయి. దుండగుడి దాడిలో గాయపడ్డ చిన్నారులు దాదాపు మూడేళ్ల వారేనని, వారిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.

నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతడు సిరియాకు చెందిన శరణార్థుడిగా తెలుస్తోంది. అతడి దాడిలో మొత్తం ఎంతమంది గాయపడ్డారన్న వివరాలు తెలియరాలేదు. గురువారం ఉదయం ఓ పార్కులో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై శరవేగంగా విచారణ జరుపుతున్నామని ఫ్రాన్స్ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ చెప్పారు.

అన్నేసి సిటీలో క్షతగాత్రులకు చికిత్స అందుతోంది. వారిని పరామర్శించేందుకు ఫ్రాన్స్‌ నేతలు భారీగా వెళ్తున్నారు. ఎవరూ ఊహించని రీతిలో జరిగిన కత్తి దాడితో ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. దాదాపు 10 మందికి పైగా గాయపడినట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.

నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు. గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Gilda Sportillo : పార్లమెంట్ లో బిడ్డకు పాలు ఇచ్చిన మహిళా ఎంపీ