Indira Gandhi: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై కెనెడాలో సంబరాలు

శ్రీ దర్బార్ సాహిబ్‌పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్యక్తం చేసింది

Indira Gandhi: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యపై కెనెడాలో సంబరాలు

Canad: భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యను ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో నిర్వహించినట్లు నెట్టింట్లో వీడియో వైరల్ అవుతోంది. ఒక వాహనంపై రక్తపు మడుగులో నిల్చున్న ఇందిరా ప్రతిమ ఉండగా.. ఆమెను కాలుస్తున్నట్లు ఉన్న ఇద్దరు సాయుధుల ప్రతిమలు కూడా ఉన్నాయి. ఈ వీడియోపై దేశంలో దుమారం చెలరేగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ వారు సైతం దీన్ని ఖండించారు. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో న్యూఢిల్లీలోని కెనడియన్ హై కమిషనర్ కామెరూన్ మెక్‌కే ఘాటుగా స్పందించారు. కెనడాలో విద్వేషానికి, హింసకు తావు లేదని, అలాంటి వాటిని కీర్తించే అవకాశం ఎంత మాత్రం లేదని అన్నారు.

Lok Sabha Elections 2024: విపక్షాల సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ ఎందుకు వెళ్లడం లేదు?

ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది 1984లో అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భాగంగా 1984 జూన్ 6న భారతీయ దళాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాయి. అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బందే 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఓ పెరేడ్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 39 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ పెరేడ్‌ను నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.


శ్రీ దర్బార్ సాహిబ్‌పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలిపింది. కెనడా రాజధాని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఓ ఫార్మల్ నోట్‌ను పంపించింది. ఇటువంటి చర్యలు ఆమోదించదగినవి కాదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం పరిధిని అతిక్రమించకూడదని తెలిపింది. ఓ ప్రజాస్వామిక దేశపు నాయకురాలి హత్యను ఘనంగా కీర్తిస్తూ పెరేడ్ నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.